అస్సలు తగ్గొద్దు ! కాంగ్రెస్ పై స్పీడ్ పెంచమంటున్న కేసీఆర్ 

తెలంగాణలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్( Congress ) తన దూకుడును ప్రదర్శిస్తోంది.ప్రతి సందర్భంలోనూ బీఆర్ ఎస్ ను( BRS ) తప్పు పట్టే విధంగా వ్యాఖ్యలు చేస్తుండడం, జనాల్లోనూ బీఆర్ఎస్ పరపతిని తగ్గించే ప్రయత్నం చేస్తుండడంతో కాంగ్రెస్ దూకుడుకు అడ్డుకట్ట వేసే విధంగా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్( KCR ) కొత్త అస్త్రాలను సిద్ధం చేస్తున్నారు.

 Kcr Wants To Increase Speed On Congress Party Details, Kcr, Telangana Elections,-TeluguStop.com

ముఖ్యంగా తెలంగాణ ఆర్థిక స్థితిగతులు , విద్యుత్ , నీటిపారుదల రంగాలపై అసెంబ్లీ వేదికగా కాంగ్రెస్ ప్రభుత్వం శ్వేత పత్రం విడుదల చేసేందుకు సిద్ధమవుతున్న నేపథ్యంలో,   ఈ పరిస్థితిని ఎలా ఎదుర్కోవాలి అనే దానిపై పార్టీ శ్రేణులకు కేసీఆర్ దిశ నిర్దేశం చేశారు.నిన్న సాయంత్రం పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ,( KTR ) మాజీ మంత్రి హరీష్ రావు( Harish Rao ) మరి కొంతమంది కీలక నేతలతో కేసీఆర్ ప్రత్యేకంగా భేటీ అయ్యారు .ఈ సందర్భంగా ఇటీవల కాలంలో చోటు చేసుకున్న అనేక అంశాలపై చర్చ జరిగింది.

Telugu Governortamili, Hareesh Rao, Revanth Reddy, Telangana-Politics

గవర్నర్ ప్రసంగానికి( Governor Speech ) ధన్యవాదాలు తెలిపే తీర్మానం సందర్భంగా ఉభయ సభల్లోనూ బీఆర్ఎస్ వ్యవహరించిన తీరు , నాయకుల ప్రసంగాలు , ప్రభుత్వ స్పందన తదితర అంశాలు ప్రస్తావనకు వచ్చాయి.  ఈనెల 20 నుంచి రెండు రోజులపాటు జరిగే అసెంబ్లీ సమావేశాల్లో చర్చ కు వచ్చే అంశాలపై ప్రధానంగా కేసీఆర్ చర్చించారు.రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే ప్రజెంటేషన్లు , చేపట్టే చర్యలపై ఎక్కడా వెనక్కి తగ్గవద్దు అని కేసీఆర్ దిశా నిర్దేశం చేశారు.” అర్థ సత్యాలు అసత్యాలతో అధికారులకు వచ్చిన కాంగ్రెస్ కు రాబోయే రోజుల్లో ఎదురయ్యే వైఫల్యాలకు బీఆర్ఎస్ ను బాధ్యులను చేసేందుకు ప్రయత్నాలు మొదలయ్యాయి.

Telugu Governortamili, Hareesh Rao, Revanth Reddy, Telangana-Politics

గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపి తీర్మానంపై జరిగిన చర్చకు సీఎం ఇచ్చిన సమాధానం అదే తరహాలో ఉంది .కాబట్టి సభా వేదికగానే అధికార పక్షాన్ని ఇరుకును పెట్టేందుకు అన్ని రంగాలకు సంబంధించిన సమగ్ర సమాచారంతో వెళ్ళండి.ఎన్ని గంటలైనా చర్చకు సిద్ధంగా ఉంటూ సమన్వయంతో ముందుకు వెళ్లండి .రంగాల వారీగా మనం సాధించిన ప్రగతిని ప్రజలకు వివరించేందుకు ఉన్న అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి ” అని సూచించారు.అసెంబ్లీ సమావేశాలు ముగిసిన వెంటనే పూర్తిస్థాయిలో పార్లమెంట్ ఎన్నికలపై( Parliament Elections ) దృష్టి సారించాలని,  ఎట్టి పరిస్థితుల్లోనూ కాంగ్రెస్ , బీజేపీ కి అవకాశం లేకుండా ఏమేం చేయాలనే దానిపై మరోసారి చర్చిద్దామని కెసిఆర్ ఈ సమావేశంలో వ్యాఖ్యానించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube