విశాఖపట్నంలో కలకలం సృష్టించిన గుప్త నిధుల తవ్వకాలపై కంచరపాలెం పోలీసుల విచారణ కొనసాగుతోంది.క్షుద్ర పూజల కోసం తవ్వకాలు జరిపారా? లేక దోష నివారణ కోసమా? అన్న దానిపై పోలీసులు ఆరా తీస్తున్నారు.
ఈ నేపథ్యంలోనే తవ్వకాలు జరపడానికి గల కారణాలపై ఇంకా స్పష్టత రాలేదు.అయితే ఈ తవ్వకాలకు, తనకు ఎటువంటి సంబంధం లేదని రైల్వే ఉద్యోగి వెంకటేశ్వర రావు చెబుతున్నారని తెలుస్తోంది.
కాగా కంచరపాలెంలో గుప్త నిధుల పేరిట తవ్వకాలు జరిగిన ఘటన స్థానికంగా తీవ్ర కలకలం సృష్టించింది.తాడిచెట్లపాలెంలోని రైల్వే క్వార్టర్స్ లో గుప్త నిధుల కోసం సుమారు 20 అడుగుల లోతు గొయ్యిని తవ్వినట్లు పోలీసులు గుర్తించారు.







