కన్నడ చిత్ర పరిశ్రమ నుంచి హీరోయిన్ గా టాలీవుడ్ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టారు నటి రష్మిక మందన్న ( Rashmika Mandanna ) ప్రస్తుతం భాషతో సంబంధం లేకుండా వరుస భాషా చిత్రాలలో నటిస్తూ కెరియర్ పరంగా ఇండస్ట్రీలో ఎంతో బిజీగా ఉన్నారు.నటి రష్మిక ఇటీవల యానిమల్ సినిమా( Animal Movie ) ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి మనకు తెలిసిందే.
పుష్ప ( Pushpa ) సినిమా ద్వారా పాన్ ఇండియా స్థాయిలో ఎంతో మంచి సక్సెస్ అందుకున్నారు.
అల్లు అర్జున్ హీరోగా నటించినటువంటి ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో విడుదలైంది.
ఇక ఈ సినిమా ఎంతో మంచి సక్సెస్ కావడంతో రష్మికకు బాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా విపరీతమైనటువంటి క్రేజ్ పెరగడంతో ఈమెకు బాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా వరుసగా అవకాశాలు వచ్చాయి.అయితే ఇప్పటివరకు మూడు సినిమాల ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చినటువంటి ఈమెకు ఏది కూడా పెద్దగా అనుకున్న స్థాయిలో సక్సెస్ ఇవ్వలేక పోయింది కానీ ఇటీవల రణ బీర్ కపూర్ సరసన నటించినటువంటి యానిమల్ సినిమా మాత్రం ఎంతో మంచి సక్సెస్ అందుకుంది.
ఈ సినిమా 1000 కోట్ల కలెక్షన్స్ కు చేరువలో ఉందని తెలుస్తుంది.

ఇక ఈ సినిమా మంచి సక్సెస్ కావడంతో రష్మికకు బాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా పెద్ద ఎత్తున అవకాశాలు వస్తున్నాయని తెలుస్తుంది.మరోవైపు లేడీ ఓరియంటెడ్ సినిమాలతో పాటు పుష్ప 2 షూటింగ్ పనులలో రష్మిక ఎంతో బిజీగా గడుపుతున్నారు.ఇక రష్మిక కెరియర్ పరంగా ఎంతో మంచి సక్సెస్ అయినప్పటికీ ఈమె గురించి తరచూ ఎన్నో విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ముఖ్యంగా ఈమె నటుడు విజయ్ దేవరకొండ( Vijay Devarakonda ) తో ప్రేమలో ఉన్నారని కానీ ఈ విషయాన్ని బయట పెట్టడం లేదు అంటూ కూడా ఈమె రిలేషన్ గురించి వార్తలు వచ్చాయి.

విజయ్ దేవరకొండతో కలిసి రష్మిక బయటకు వెళ్లడం తన ఫ్యామిలీ ఫంక్షన్లకు హాజరు కావడం వంటివి చేస్తూ ఉంటారు.దీంతో వీరిమధ్య రిలేషన్ ఉందని, ఈమె దేవరకొండ ఫ్యామిలీ కోడలుగా అడుగుపెట్టబోతున్నారని అభిమానులు కూడా భావిస్తున్నారు.ఇలాంటి తరుణంలోనే ఈమె సోషల్ మీడియా వేదికగా చేసినటువంటి పోస్ట్ ప్రస్తుతం వైరల్ గా మారింది.
రష్మిక ఇంస్టాగ్రామ్ స్టోరీ గా ఒక పోస్ట్ ని షేర్ చేస్తూ నేను ఏదైనా నీకు చెప్పాలి అంటే కేవలం థాంక్స్ మాత్రమే చెప్పగలనని నువ్వు నా జీవితంలోకి వచ్చినందుకు కృతజ్ఞతలు అంటూ ఈ సందర్భంగా ఈమె సోషల్ మీడియా వేదికగా షేర్ చేశారు.దీంతో ఈ పోస్ట్ కాస్త వైరల్ గా మారింది.
ఇది చూసినటువంటి అభిమానులు రష్మిక పోస్ట్ ఏదో తేడా కొడుతుంది ఈమె ఎవరిని ఉద్దేశించి ఈ పోస్ట్ చేశారు తన జీవితంలోకి ఎవరు వచ్చారు అంటూ పెద్ద ఎత్తున నేటిజన్స్ సందేహాలను వ్యక్తం చేస్తూ కామెంట్లు చేస్తున్నారు.







