ఏపీలో ఆరోగ్యశ్రీపై అవగాహన కార్యక్రమం ప్రారంభమైంది.ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ ప్రతి పేదవానికి ఆరోగ్యశ్రీని చేరువ చేయడమే లక్ష్యమని తెలిపారు.
ఈ క్రమంలోనే ఆరోగ్య శ్రీ పరిమితిని రూ.25 లక్షలకు పెంచామని సీఎం జగన్ వెల్లడించారు.వైద్యం ఖర్చు రూ.వెయ్యి దాటితే ఆరోగ్య శ్రీ కిందకు వచ్చేలా చర్యలు తీసుకున్నామన్నారు.అలాగే సుమారు 2,513 ఆస్పత్రులకు ఆరోగ్య శ్రీని విస్తరించామని తెలిపారు.వైద్యరంగంలో ఎప్పుడూ జరగని విధంగా నాడు -నేడు కార్యక్రమం ద్వారా విలేజ్ క్లినిక్ లు, పీహెచ్సీలు, సీహెచ్సీలను అందుబాటులోకి తీసుకురావడంతో పాటు అన్ని ఆస్పత్రుల్లో మౌలిక సదుపాయాలు అందిస్తున్నామని తెలిపారు.
వైద్యం కోసం పేదవారు అప్పులపాలు కాకుండా ఉండే విధంగా వైద్యరంగంలో ఆరోగ్య శ్రీ కార్యక్రమానికి శ్రీకారం చుట్టామని పేర్కొన్నారు.ఇందులో భాగంగా ఆరోగ్య శ్రీ పరిమితిని పెంచామని సీఎం జగన్ స్పష్టం చేశారు.