మనలో చాలామంది సంపాదించిన డబ్బులో ఒక శాతం దానం చేయడానికి కూడా ఆసక్తి చూపరు.అయితే పల్లవి ప్రశాంత్( Pallavi Prashanth ) మాత్రం బిగ్ బాస్ షో ద్వారా తాను సంపాదించిన 35 లక్షల రూపాయలను కష్టాల్లో ఉన్న రైతులకు పంచుతానని చెప్పిన విషయాలు వైరల్ అవుతున్నాయి.
గుండెలపై చెయ్యి వేసుకుని ఈ విషయాలను చెబుతున్నానని పల్లవి ప్రశాంత్ అన్నారు.బిగ్ బాస్ సీజన్7 ( Bigg Boss Season 7 )లో అత్యధిక ఓట్లు సాధించిన పల్లవి ప్రశాంత్ 35 లక్షల రూపాయల నగదుతో పాటు వితెరా బ్రెజా కారు.15 లక్షల రూపాయల డైమండ్ జ్యూయలరీ గెలుచుకున్నారు.
పల్లవి ప్రశాంత్ మాట్లాడుతూ నాకు ఓటేసిన అన్నాదమ్ములకు, అక్కాచెల్లెళ్లకు రుణపడి ఉంటానని జనం మెచ్చిన రైతుబిడ్డగా మీకు ధన్యవాదాలు చెబుతున్నానని పల్లవి ప్రశాంత్ పేర్కొన్నారు.
నేను ఇక్కడికి రావాలని ఎన్నో రోజులు తిరిగానని నేను భోజనం చేయని రోజులు సైతం ఉన్నాయని పల్లవి ప్రశాంత్ చెప్పుకొచ్చారు.నన్ను నేను నమ్ముకుని నేను చేయగలనని అనుకున్నానని ఆయన తెలిపారు.

ఇదే విషయం నాన్నకు చెప్పగా నీ వెనుక నేనున్నానని నాన్న అన్నారని పల్లవి ప్రశాంత్ పేర్కొన్నారు.నాగార్జున సార్ ను చూడగానే మాటలు రాలేదని ఆయన ఎప్పుడూ నవ్వుతూనే ఉండాలని చాలామంది జీవితాలు బాగుపడతాయని పల్లవి ప్రశాంత్ చెప్పుకొచ్చారు.నేను గెలుచుకున్న 35 లక్షల రూపాయలలో ప్రతి రూపాయి రైతులకే పంచుతానని జై జవాన్ జై కిసాన్( Jai Jawan Jai Kisan ) అంటూ పల్లవి ప్రశాంత్ కామెంట్లు చేశారు.

నేను ఇచ్చిన మాట తప్పనని పల్లవి ప్రశాంత్ చెప్పుకొచ్చారు.అమర్ దీప్ మాట్లాడుతూ పల్లవి ప్రశాంత్ ట్రోఫీ గెలిచాడని నేను ప్రేక్షకుల హృదయాలను గెలిచానని అన్నారు.బిగ్ బాస్ కంటెస్టెంట్ల రెమ్యునరేషన్ల వివరాలు సైతం నెట్టింట వైరల్ అవుతున్నాయి.
బిగ్ బాస్ షో పల్లవి ప్రశాంత్ క్రేజ్, ఫ్యాన్ ఫాలోయింగ్, పాపులారిటీని ఊహించని స్థాయిలో పెంచింది.







