వచ్చే ఎన్నికల్లో గెలిస్తే మరో 20 సంవత్సరాలు పాటు తానే ముఖ్యమంత్రిగా ఉంటానని అనేక సందర్భాల్లో బహిరంగంగా ప్రకటించిన జగన్( CM YS Jagan Mohan Reddy ) ఈసారి ఎట్టి పరిస్థితులన లోనూ గెలవడానికి అన్ని రకాల ఏర్పాట్లు చేసుకున్నట్లుగా కనిపిస్తుంది.ముఖ్యంగా ఎన్నికలకు ముందు పార్టీ ని పూర్తిస్థాయిలో ప్రక్షాళన చేస్తున్న జగన్ ప్రజాభిమానాన్ని ప్రాతిపదికగా తీసుకుంటూ సర్వే రిపోర్టుల ఆధారంగా అనేక మార్పులు చేర్పులకు తెర తీశారు.
ఎన్నికల ముందు ఒక రకంగా ఇది సాహసోపేతమైన చర్య అయినా కూడా ధైర్యంగా ముందుకు వెళుతున్న జగన్ కచ్చితంగా తాను అనుకున్న అభ్యర్థులతోనే ఎన్నికలను ఎదురుకోవాలని చూస్తున్నట్లుగా తెలుస్తుంది.ముఖ్యంగా ఉత్తరాంధ్ర పై ప్రత్యేకమైన శ్రద్ధ పడుతున్న వైసీపీ అధిష్టానం రాయలసీమతో పాటు ఉత్తరాంధ్ర( Uttarandhra )ను గెలుచుకుంటే గెలుపు సులువుతుందని లెక్కలు కడుతున్నట్లుగా తెలుస్తుంది.ముఖ్యంగా రాయలసీమ ఎలాగో తమకు కంచుకోట కాబట్టి ఉత్తరాంధ్రలో మెజారిటీ సీట్లు గెలుచుకుంటే మ్యాజిక్ ఫిగర్ను ఈజీగా దాట వచ్చు అన్నది వైసిపి ఆలోచనగా తెలుస్తుంది.
ఎందుకంటే ఉభయగోదావరి జిల్లా లతో పాటు కృష్ణ, గుంటూరు జిల్లాలలో జనసేన టీడీపీ( Janasena, TDP )లు బలంగా ఉండటం నెల్లూరు జిల్లాలో కూడా వైసీపీకి ఎదురుగాలి వీస్తూ ఉండటంతో ఇప్పుడు తమకు అనుకూలంగా ఉన్న ఉత్తరాంధ్ర పైనే వైసిపి ఆశలు కపేట్టుకుంటుంది .ముఖ్యంగా ఇక్కడ దిగ్గజ నేత బొత్స అండ ఉండటం ఆ పార్టీకి పెద్దగా ఊరటగా తెలుస్తుంది.అందుకే వైసిపి ఉత్తరాంధ్ర కేంద్రం గా అనేక అభివృద్ధి కార్యక్రమాలకు తేరతీసింది.
రాజధానిని కూడా ఇక్కడకు మార్చడం, బొగపురం విమానాశ్రయం, ఉద్దానం సమస్యకు హాస్పిటల్ నిర్మాణం , వంటి కార్యక్రమాల వెనక ప్రధాన వ్యూహం అదే అని తెలుస్తుంది .జనవరి ఫస్ట్ నుంచి విశాఖ కేంద్రంగానే పరిపాలనను మొదలుపెట్టి పూర్తిస్థాయిలో ఉత్తరాంధ్ర అభివృద్ధిపై అనేక శంకుస్థాపన కార్యక్రమాలకు వైసీపీ తెరతీస్తున్నట్లుగా తెలుస్తుంది .జనసేన తెలుగుదేశం కాంబినేషన్ ఎదురుకోవడానికి ఇదే సరైన ఫార్ములా అని జగన్ నిర్ణయించుకున్నట్లుగాకనిపిస్తుంది .మరి వైసిపి వ్యూహానికి ఉత్తరాంధ్ర ఏ మేరకు మద్దతు ఇస్తుందో చూడాలి
.