గత రెండు పర్యాయాలు చేసినట్లుగానే ఈసారి కూడా వైసిపి( YCP ) ఎన్నికలకు ముందుగానే అన్ని రకాల సర్దుబాటులను పూర్తి చేసుకున్నట్లుగా కనిపిస్తుంది.ముఖ్యంగా ఎమ్మెల్యేల పనితీరు ఆధారంగానే సీట్లు కేటాయింపు ఉంటుందని చాలాముందు గానే ప్రకటించిన వైసీపీ అధినేత జగన్( Jagan ) ఇప్పుడు సిట్టింగ్ ఎమ్మెల్యేలకు స్థాన చలనాలు కల్పిస్తూ షాక్ ఇస్తున్నారు.
కొంతమందికి సీట్లు కూడా నిరాకరిస్తున్నారు.అయినప్పటికీ పెద్దగా వ్యతిరేకత రాకుండా వైసిపి చూపిస్తున్న మేనేజ్మెంట్ స్కిల్స్ చాలామందిని ఆశ్చర్యపరుస్తుంది.
నిజానికి ఈ స్థాయిలో మార్పులు ,చేర్పులు వేరే ఏ పార్టీ అయినా చేస్తే ఇప్పటికే తీవ్ర స్థాయిలో రగడ జరిగి ఉండేది.
కానీ 11 స్థానాలలో మార్పులు చేసి ఇంకా 50 నుంచి 60 స్థానాలలో మార్పులు చేస్తామని లీక్ లు ఇస్తున్నా కూడా ఎమ్మెల్యేల నుంచి పెద్దగా వ్యతిరేకత రాకుండా మేనేజ్ చేయగలుగుతుంది అంటే వైసిపి ఏ స్థాయిలో ప్రిపేర్ అయిందో అర్థమవుతుంది.
ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం ఉన్న రాజకీయ వాతావరణం కూడా వైసిపికి కలిసి వస్తున్నట్లుగా తెలుస్తుంది, ఎందుకంటే ముక్కోనపు పోటీని జనసేన తెలుగుదేశం( Janasena TDP ) కలిసి పోటీ చేస్తూ రెండు పార్టీల మధ్య పోరుగా మార్చేసిన దరిమిలా ఇప్పుడు కొత్తగా పార్టీ మారాలనుకున్న అభ్యర్థులకు ఖాళీలు లేని వాతావరణం కనిపించింది.
కాంగ్రెస్ పుంజుకొని ముందుకు వస్తే తప్ప ఇప్పుడు చాలామంది రాజకీయంగా నిరుద్యోగులుగా మారిపోయే అవకాశం కనిపిస్తుంది.ఒక పథకం ప్రకారం ముందుగా సమాచారం ఇస్తూ టికెట్ కేటాయించకపోవడానికి గాని లేదా స్థానచలనం కలిగించడానికి గాని దారి తీసిన పరిస్థితులు వివరిస్తూ ఒక పద్ధతి ప్రకారం ముందుకు వెళ్తున్న వైసీపీ అధిష్టానం ఎమ్మెల్యేలను బుజ్జగించడంలో చాలా మేరకు సక్సెస్ అవుతున్నట్లు కనిపిస్తుంది.
ఈసారి ఎట్టి పరిస్థితుల లోనూ గెలుపే లక్ష్యంగా ముందుకెళ్లాలని చూస్తున్న జగన్ టికెట్ల కేటాయింపులలో ఏ రకమైన మొహమాటలు పట్టించుకోవటం లేదని తనకు సమీప బంధువు అయిన ఆళ్ళ రామకృష్ణారెడ్డికి( Alla Ramakrishna Reddy ) టికెట్ నిరాకరించినప్పుడే అందరికీ అర్థమైనట్లుగా తెలుస్తుంది.ఒకరకంగా అందరికీ అర్థం అవ్వాలనే జగన్ మంగళగిరి నుంచి మార్పులకు శ్రీకారం చుట్టినట్టుగా ఇప్పుడు అందరికీ అర్థమవుతున్నట్లుగా తెలుస్తుంది.వైసిపి స్పీడ్ చూస్తుంటే ప్రతిపక్షాలు ఊహించనంత వేగంగా నిర్ణయాలు తీసుకొని పార్టీని ఎన్నికలకు సిద్ధం చేయాలని నిర్ణయించుకున్నట్టుగా తెలుస్తుంది.