రాజన్న సిరిసిల్ల స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ గా పూజారి గౌతమిని నియామకం చేస్తున్నట్లు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శుక్రవారం రాత్రి ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే.కాగా శనివారం గౌతమి సిరిసిల్ల స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ గా బాధ్యతలు స్వీకరించారు.
అంతకుముందు జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతిని మర్యాదపూర్వకంగా కలిసి తన జాయినింగ్ రిపోర్టును అందజేశారు.అనంతరం కలెక్టర్ ఆవిడకు పుష్పగుచ్చం ఇచ్చి అభినందనలు తెలిపారు.2021 బ్యాచ్ కి చెందిన గౌతమి తన మొదటి పరీక్షలోనే 317 ర్యాంక్ తెచ్చుకొని ఐఎఎస్ సాధించారు.
మంచిర్యాలలో కలెక్టర్ గా ట్రైనింగ్ పూర్తి చేసుకున్నారు.
స్థానిక సంస్థలకు ఇంచార్జి కలెక్టర్ గా ఉన్న జిల్లా పరిషత్ ముఖ్య కార్య నిర్వహణ అధికారి గౌతంరెడ్డి నుంచి గౌతమి ఛార్జ్ తీసుకున్నారు.అనంతరం ఆర్డిఓ ఆనంద్ కుమార్, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ గంగయ్య, డిఆర్డిఓ నక్క శ్రీనివాస్, మున్సిపల్ కమిషనర్ లు అన్వేష్ ,మీర్జా ఫాసత్ అలి బేగ్ ,డిపిఓ రవీందర్, మైనింగ్ ఏడి సైదులు, జిల్లా పౌర సంబంధాల అధికారి మామిండ్ల దశరథం తోపాటు పలువురు అధికారులు మర్యాదపూర్వకంగా కలిశారు.
అనంతరం ఆమె వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామిని దర్శించుకున్నారు.