మీ జుట్టు చాలా పల్చగా ఉందా.? కురులను ఒత్తుగా మార్చుకునేందుకు ప్రయత్నిస్తున్నారా.? ఎన్ని రకాలుగా ప్రయత్నించినా ఎలాంటి ఫలితం ఉండటం లేదా.? అయితే ఇప్పుడు చెప్పబోయే కివీ పండు హెయిర్ మాస్క్ ను మీరు ట్రై చేయాల్సిందే.ఆరోగ్యానికి కివీ పండు ఎంతో మేలు చేస్తుందో.ఎన్నో ప్రయోజనాలను అందిస్తుందో ప్రత్యేకంగా వివరించి చెప్పక్కర్లేదు.రోజుకు ఒక కివీ పండును తినడం వల్ల అనేక జబ్బులకు దూరంగా ఉండవచ్చు.చర్మ సౌందర్యాన్ని పెంచడానికి కూడా కివీ పండు ( Kiwi fruit )అద్భుతంగా సహాయపడుతుంది.
అలాగే జుట్టు ఆరోగ్యానికి సైతం అండగా ఉంటుంది.మరి ఇంతకీ కివీ పండును జుట్టుకు ఎలా ఉపయోగించాలి.? అన్నది ఇప్పుడు తెలుసుకుందాం.ముందుగా బాగా పండిన ఒక కివీ పండును తీసుకుని పీల్ తొలగించి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి.
ఈ ముక్కలను మిక్సీ జార్ లో వేసి ప్యూరీలా గ్రైండ్ చేసుకోవాలి.ఇలా గ్రైండ్ చేసుకున్న మిశ్రమంలో ఐదు టేబుల్ స్పూన్లు ఫ్రెష్ ఉల్లిపాయ జ్యూస్ ( Onion juice )మరియు వన్ టేబుల్ స్పూన్ కోకోనట్ ఆయిల్ వేసుకుని అన్నీ కలిసేలా బాగా మిక్స్ చేసుకోవాలి.
ఇలా తయారు చేసుకున్న మిశ్రమాన్ని జుట్టు కుదుళ్ల నుంచి చివర్ల వరకు పట్టించి షవర్ క్యాప్ ధరించాలి.గంట అనంతరం మైల్డ్ షాంపూ ను ఉపయోగించి శుభ్రంగా తల స్నానం చేయాలి.
వారానికి ఒక్కసారి ఈ మాస్క్ ను వేసుకోవడం వల్ల డబుల్ హెయిర్ గ్రోత్( Hair growth ) మీ సొంతం అవుతుంది.జుట్టు ఎంత పల్చగా ఉన్నా కూడా కొద్దిరోజుల్లోనే ఒత్తుగా మారుతుంది.అదే సమయంలో జుట్టు రాలడం కంట్రోల్ అవుతుంది.కురులు హెల్తీగా స్ట్రాంగ్ గా మారతాయి.కాబట్టి, ఒత్తైన ఆరోగ్యమైనా కురులను కోరుకునేవారు తప్పకుండా ఈ కివీ పండు హెయిర్ మాస్క్( Hair mask ) ను ప్రయత్నించండి.మంచి రిజల్ట్ మీ సొంతం అవుతుంది.