తెలుగు సినీ ప్రేక్షకులకు నటి జయసుధ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.ఈమె ఈ తరం ప్రేక్షకులకు, ఆ తరం ప్రేక్షకులకు ఇద్దరికి కూడా సుపరిచితమమే.
ఎన్నో సినిమాలలో నటించి సహజనటిగా మంచి గుర్తింపు తెచ్చుకుంది జయసుధ.తెలుగు సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరోల సరసన హీరోయిన్ గా నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది.
ఆ తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటిస్తూ ఇండస్ట్రీలో కొనసాగుతోంది.ఇప్పటికే ఎన్నో సినిమాలలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటించి మెప్పించిన ఇప్పటికీ సినిమాలలో నటిస్తూనే ఉంది.
అయితే జయసుధకు హీరోయిన్ గా కంటే క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మరింత గుర్తింపు వచ్చింది అని చెప్పవచ్చు.
ఇది ఇలా ఉంటే తాజాగా జయసుధ( Jayasudha )కు సంబంధించి ఒక ఆసక్తికర వార్త చక్కర్లు కొడుతోంది.అదేమిటంటే ఒకానొక సమయంలో సీనియర్ ఎన్టీఆర్ ( Sr ntr )జయసుధను సినిమాలో మానేయాలని చెప్పారట.ఎందుకంటే ఆమెకు 19 ఏళ్ల వయసులోనే భారీగా సినిమా అవకాశాలు వచ్చాయట.19 ఏళ్ల వయసుకే ఎన్టీఆర్ ఏఎన్నార్ లాంటి స్టార్ హీరోల సినిమాలలో నటించే అవకాశాలను సొంతం చేసుకుందట జయసుధ.ఇక ఆ సమయంలో ఆమె ఇక చాలు సినిమాలు ఆపేద్దాం అని అనుకుందట.
కానీ అప్పటి నుంచి ఆమెకు సినిమా అవకాశాలు ఎక్కువగా రావడం మొదలయ్యాయట.
తర్వాత జయసుధ పెళ్లి చేసుకోగా పెళ్లి తర్వాత మరిన్ని ఎక్కువ అవకాశాలు రావడంతో ఆమె నటించిన ప్రతి ఒక్క హీరో దగ్గర ఇక చాలు సినిమాలు చేయడం ఆపేస్తాను అని చెబుతూ ఉండేదట.అప్పుడు ఒకరోజు సీనియర్ ఎన్టీఆర్ అమ్మ నువ్వు సినిమాలు చేయడం మానేసెయ్ లేదంటే ఇకపై నేను సినిమాలు ఆపేస్తాను అని చెప్పడం అన్నా మానేసేయి అని సరదాగా చెప్పేవారట.ఈ విషయాన్ని ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది జయసుధ.