టెక్నికల్ ఇష్యూస్ వల్ల ఆన్‌లైన్ సర్వీసులు కస్టమర్లు ఆర్డర్ చేయకపోయినా వస్తువులను పంపిస్తుంటాయి.ఒక్కసారి కస్టమర్లు కూడా తమకు తెలియకుండానే పొరపాట్లు చేసి కావలసిన దానికంటే ఎక్కువ ఆర్డర్లను పొందుతారు.
తాజాగా ఒక స్విగ్గీ కస్టమర్ యాప్( Swiggy ) లో టెక్నికల్ ఇష్యూ కారణంగా ఆరుసార్లు గ్రాసరీస్ అందుకున్నాడు.ప్రణయ్ లోయా( Pranay ) కస్టమర్ గురువారం నాడు మైక్రోబ్లాగింగ్ ప్లాట్‌ఫామ్‌లో డెలివరీ సర్వీస్ యాప్ అయిన స్విగ్గీతో తనకు ఎదురైన వింత అనుభవాన్ని పంచుకున్నాడు.

ప్రణయ్ ఇటీవల స్విగ్గీ నుంచి కొన్ని కిరాణా సామాగ్రిని ఆర్డర్ చేయాలనుకున్నాడు, కానీ అతని మొదటి ప్రయత్నం విఫలమైంది.ఆన్‌లైన్‌లో ఆర్డర్ కోసం డబ్బు చెల్లించగా, ఆ ఆర్డర్ క్యాన్సిల్ అయ్యిందని యాప్ చూపించింది.దాంతో మళ్లీ ప్రయత్నించాడు, కానీ ఈసారి కూడా ఆర్డర్ క్యాన్సిల్ అయింది.దీనివల్ల అతడు డబ్బును రెండుసార్లు కోల్పోయాడు, కానీ అతని ఆర్డర్ కన్ఫర్మేషన్ మాత్రం రాలేదు.

అతను తన క్యాష్ ఆన్ డెలివరీ( Cash on delivery )కి మార్చాలని నిర్ణయించుకున్నాడు, అది పని చేస్తుందని ఆశించాడు.చాలాసార్లు ఆర్డర్ ఇచ్చాడు, కానీ వాటిలో ఏవీ వర్కౌట్ కాలేదు.విసుగు చెంది, స్విగ్గీని వదులుకుని, మరో డెలివరీ సర్వీస్ యాప్‌కి మారాడు.ఎట్టకేలకు తనకు కావాల్సిన వస్తువులను ఆర్డర్ చేయగలిగాడు.అయితే అప్పుడు అనుకోని సంఘటన జరిగింది.అతని ఆర్డర్‌లతో స్విగ్గీ డెలివరీ ఎగ్జిక్యూటివ్‌లు అతనికి కాల్స్ చేయడం ప్రారంభించారు.
దాంతో క్యాన్సిల్ అయిన అన్ని ఆర్డర్స్ మళ్లీ యాప్‌లో ఓకే అయ్యాయని కస్టమర్‌కు అర్థమయింది.దీని ఫలితంగా చివరికి కోరుకున్న దానికంటే ఆరు రెట్లు కిరాణా సామాను అందుకోవాల్సి వచ్చింది.
ఆ కస్టమర్ 20 లీటర్ల పాలు, 6 కేజీల దోసె పిండి, 6 ప్యాకెట్ల పైనాపిల్‌తో కూడిన తన అదనపు వస్తువుల ఫోటోతో కూడిన ట్వీట్‌ను పోస్ట్ చేశాడు.ఆ పోస్టు వైరల్ అవుతుంది.
స్విగ్గీ ఈ పోస్ట్ కు రిప్లై ఇస్తూ రీసెంట్ ఆర్డర్ కు సంబంధించిన ఐడి షేర్ చేయాలని కోరింది.ఏదేమైనా ఇలాంటి టెక్నికల్ గ్లిచ్ వల్ల సదరు కస్టమర్ చాలా ఇబ్బంది పడాల్సి వచ్చింది.







