బాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా ఎంతో మంచి సక్సెస్ అందుకున్నటువంటి వారిలో నటి దీపికా పదుకొనే(Deepika Padukone) ఒకరు.ప్రస్తుతం ఈమె ఇండస్ట్రీలో వరుస సినిమాలలో నటిస్తూ నటిగా ఎంతో బిజీగా ఉండటమే కాకుండా నిర్మాతగా కూడా పలు సినిమాలను నిర్మిస్తూ కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉన్నారు.
ఇలా హీరోయిన్ గా ఇండస్ట్రీలో కొనసాగుతూ ఉన్నటువంటి దీపిక పదుకొనే నేడు తిరుమల శ్రీవారిని (Tirumala Srivaru) దర్శించుకున్నారు.నేడు ఉదయం వీఐపీ సుప్రభాతం విరామ సమయంలో ఈమె స్వామివారిని దర్శించుకుని స్వామివారి తీర్థప్రసాదాలను తీసుకున్నారు.

ఇకపోతే దీపికా పదుకొనే కాలినడకన తిరుమల కొండకు చేరుకున్నారు గురువారం సాయంత్రం ఈమె అలిపిరి మార్గంలో దాదాపు 3 గంటల పాటు నడుస్తూ మెట్ల మార్గం గుండా కొండపైకి చేరుకున్నారు.దీపికా పదుకొనే సామాన్య భక్తురాలిగా కాలినడకన తిరుమల కొండకు చేరుకోవడంతో మార్గమధ్యమంలో ఎంతో మంది అభిమానులు ఈమెతో కలిసి సెల్ఫీలు దిగడానికి ఉత్సాహం కనబరిచారు.కాలినడకన కొండపైకి చేరుకున్నటువంటి దీపిక పదుకొనే రాదేయం అతిథి గృహంలో రాత్రికి విశ్రాంతి తీసుకుని నేడు ఉదయం సుప్రభాత సేవలో స్వామివారిని దర్శించుకున్నారు.

ప్రస్తుతం ఈమె తిరుమలకు సంబంధించినటువంటి ఫోటోలు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.ఇక ఈమె ప్రస్తుతం ప్రభాస్ హీరోగా నటిస్తున్నటువంటి కల్కి( Kalki ) సినిమాలో నటిస్తున్న సంగతి మనకు తెలిసిందే.ఈ సినిమా ద్వారా మొదటిసారి దీపిక పదుకొనే తెలుగు ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధంగా ఉన్నారు.
ఈ సినిమాలో ఓ చిన్న పాత్రలో నటించారు.అలాగే పఠాన్ సినిమాలో కూడా ఈమె నటించి మంచి సక్సెస్ అందుకున్నారు.







