నిన్న మొన్నటి వరకు మాజీ సీఎం కేసీఆర్ ( KCR ) అధికారిక నివాసంగా మార్చుకున్న ప్రగతిభవన్ ప్రస్తుతం తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క నివాసంగా మారిపోయింది.అయితే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక ప్రగతి భవన్ కాస్త ప్రజాభవన్ గా మారుస్తామని దానికి మహాత్మా జ్యోతిరావు పూలే నివాసంగా పేరు పెడతామని రేవంత్ రెడ్డి ( Revanth reddy ) ప్రకటించారు.
అంతేకాకుండా ప్రగతి భవన్లో మొదటిసారి ప్రజాదర్బార్ కార్యక్రమాన్ని కూడా రేవంత్ రెడ్డి విజయవంతం చేశారు.అంతేకాకుండా ప్రతి మంగళ,శుక్రవారాల్లో ప్రజావాణి కూడా ఉంటుందని స్పష్టం చేశారు.
అయితే ప్రగతిభవన్లో గతంలో సీఎం గా చేసిన కేసీఆర్ ఉండేవారు.ఇక ఈ లెక్కన ఈసారి కూడా ప్రగతిభవన్లో రేవంత్ రెడ్డి ఉండాలి.
కానీ రేవంత్ రెడ్డికి బదులు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ( Mallu Bhatti Vikramarka ) ప్రగతిభవన్లో నివాసం ఉంటున్నారు.అయితే సీఎం కి బదులు డిప్యూటీ సీఎం ఎందుకు ప్రగతిభవన్లో నివాసం ఉంటున్నారు అని ప్రతి ఒక్కరిలో అనుమానం మొదలైంది.
అయితే రేవంత్ రెడ్డి ప్రగతిభవన్ ( Pragathi bhavan ) లో ఉండకపోవడానికి కారణం గతంలో రేవంత్ రెడ్డి ప్రగతిభవన్ పై ప్రగతి భవన్ లో ఉండే కేసీఆర్ పై ఎన్నో ఆరోపణలు చేశారు.కెసిఆర్ ప్రగతిభవాన్ ని తన గడీ లాగా మార్చుకున్నారని షాకింగ్ కామెంట్లు చేశారు.అలాగే కెసిఆర్ ఉన్న ప్రగతిభవన్లో రేవంత్ రెడ్డికి నివాసం ఉండడం నచ్చడం లేదని, ఈ కారణంతోనే ఆయన ప్రగతి భవన్ కి బదులు వేరే ఇంట్లో ఉండాలనే నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది.
ఇక ఇప్పటికే రేవంత్ రెడ్డి ఉండడానికి సరైన సీఎం క్యాంప్ ఆఫీస్ కోసం ఎన్నో ప్రాంతాలను చుట్టేస్తున్నారు అధికారులు.ఇక కేసీఆర్ ( KCR ) హాస్పిటల్లో ఉంటే ఆయన దగ్గరికి వెళ్లి కలిసి తమ మధ్య ఎలాంటి గొడవలు లేవు అని అందరికీ తెలిసేలా చేసిన రేవంత్ రెడ్డి కేసీఆర్ ఉన్న ఇంట్లో మాత్రం ఎందుకు ఉండడం లేదు అని ప్రతి ఒక్కరు ప్రశ్నలు వేస్తున్నారు.మరి రేవంత్ రెడ్డి ప్రగతిభవన్ లో ఉండకపోవడానికి కారణం ఏంటో తెలియాల్సి ఉంది.