తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉన్న కొంతమంది హీరోలు తమదైన రీతిలో మంచి సినిమాలను చేసి స్టార్ హీరోలుగా గుర్తింపు పొందారు.ఇక ఇలాంటి వాళ్లలో నాని ఒకడు.
ప్రస్తుతం నాని హాయ్ నాన్న( Hi Nanna ) అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి విజయాన్ని అందుకున్నాడు అయితే నాని వరుసగా సినిమాలు హిట్స్ కొట్టడం వెనుక రహస్యం ఏంటి అంటూ ప్రతి ఒక్కరు దాని గురించే చర్చించుకుంటున్నారు.

ఇంకా కొంతమంది అయితే సోషల్ మీడియాలో( Social media ) నాని హిట్స్ కొట్టడం వెనుక రహస్యం ఏంటి అంటూ కామెంట్లు చేస్తున్నారు.అయితే ఈ విషయం మీద స్పందించిన నాని రీసెంట్ గా ఒక ఇంటర్వ్యూలో తన సక్సెస్ కి సీక్రెట్ అంటూ ఏమి ఉండదు మనం ఎంచుకున్న స్టోరీలే మనకి సక్సెస్ లను అందిస్తాయంటూ తనదైన రీతిలో సమాధానం చెప్పాడు.అయితే నిజానికి నాని డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్టోరీస్ ని ఎంచుకొని సినిమాలు చేసే విధంగా ముందుకు కదులుతున్నాడు అయినప్పటికీ ఆయనకి పెద్దగా సక్సెస్ లు వస్తున్నాయి.

కానీ స్టార్ హీరో అయ్యే సక్సెస్ అయితే ఆయనకి రావడం లేదు ఎందుకంటే ఆయన ఎంచుకున్న సినిమాలన్నీ మీడియం బడ్జెట్ సినిమాలే కావడం వల్ల అవి భారీ స్థాయిలో కలెక్షన్స్ ని రాబట్టడం లేదు.ఆయనకు 100 కోట్లు కలెక్షన్స్ ని రాబట్టే సినిమాలు చాలా తక్కువగా ఉంటున్నాయి.అందు వల్లే ఆయన కూడా ఒక మంచి భారీ ప్రాజెక్టును చేస్తే అది ఖచ్చితంగా భారీ కలెక్షన్స్ ని వసూలు చేస్తుంది కాబట్టి అలాంటి సినిమాలు ద్వారా చాలా కలెక్షన్స్ వస్తాయి ఇంకా దాంతో హీరో గా నాని( Nani ) కూడా స్టార్ హీరో రేంజ్ కి వెళ్ళిపోతాడు…అందుకే నాని కూడా ఇక మీదట అలాంటి సినిమాలే చేయాలని చూస్తున్నాడు.








