ఏపీ సీఎం జగన్ పై కోడికత్తితో దాడి కేసులో నిందితుడిగా ఉన్న శ్రీనివాస్ బెయిల్ పిటిషన్ పై విచారణ వాయిదా పడింది.ఈ మేరకు తదుపరి విచారణను ఏపీ హైకోర్టు ఈనెల 20కి వాయిదా వేసింది.
శ్రీనివాస్ బెయిల్ పిటిషన్ లో ప్రొసీజర్ ఫాలో కాలేదని ఏపీ హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.ఈ క్రమంలోనే మెమో రూపంలో అన్ని అంశాలను కోర్టు ఎదుట ఉంచాలని పిటిషనర్ తరపు న్యాయవాదిని హైకోర్టు ఆదేశించింది.
అనంతరం తదుపరి విచారణను న్యాయస్థానం వాయిదా వేసింది.







