రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట(Yellareddypet ) మండల కేంద్రానికి చెందిన శ్యామంతుల అనిల్, దుంపెన రమేష్ లకు ఈ నెల 10న విజయవాడలో తెలుగు వెలుగు సాహితీ వేదిక స్వచ్ఛంద సంస్థ వారు కళా రత్న అవార్డు, ప్రొఫెసర్ ఆచార్య జయశంకర్ అవార్డులను ప్రధానం చేశారు.
ఈ సందర్భంగా ఎల్లారెడ్డిపేట సహాయ స్వచ్ఛంద సేవా సంస్థ అధ్యక్షులు వంగ గిరిధర్ రెడ్డి( Vanga Giridhar Reddy ) ఆధ్వర్యంలో అవార్డు గ్రహీతలను సన్మానించారు.
ఈ కార్యక్రమంలో వంగ గిరిధర్ రెడ్డి, ప్రముఖ ఫోటోగ్రాఫర్ ముత్యాల ప్రభాకర్ రెడ్డి, సింగిల్ విండో డైరెక్టర్ నేవూరి వెంకట నరసింహారెడ్డి, చందుపట్ల లక్ష్మారెడ్డి, నేవూరి సురేందర్ రెడ్డి, యమగొండ పద్మా రెడ్డి, సాన రవి, నూకల శ్రీనివాస్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.