బీఆర్ఎస్ పార్టీకి గెలుపోటములు కొత్త కాదని మాజీ మంత్రి హరీశ్ రావు అన్నారు.అధికారంలో ఉన్నప్పుడు పొంగి పోలేదన్న ఆయన లేనప్పుడు కుంగిపోలేదని తెలిపారు.
కాంగ్రెస్, బీఆర్ఎస్ కు రెండు శాతం ఓట్ల తేడా మాత్రమే ఉందని మాజీ మంత్రి హరీశ్ రావు పేర్కొన్నారు.ఈ పార్లమెంట్ ఎన్నికల్లో సమిష్టిగా పని చేద్దామని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు.
అధికారంలో ఉన్నా ప్రతిపక్షంలో ఎల్లప్పుడూ ప్రజల పక్షానే బీఆర్ఎస్ నిలుస్తుందన్న హరీశ్ రావు పార్టీ సమస్యలపై ప్రజా గొంతుకగా పని చేయాలని నేతలకు సూచించారు.







