రాజన్న సిరిసిల్ల జిల్లా: తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ త్వరగా కోలుకోవాలని కోరుతూ ఎల్లారెడ్డిపేట బిఆర్ఎస్ పార్టీ పట్టణ అద్యక్షులు బండారి బాల్ రెడ్డి ఆధ్వర్యంలో ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని శ్రీ షిర్డీ సాయిబాబా మందిరంలో మంగళవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు.ఈ సందర్భంగా ఎల్లారెడ్డిపేట సింగల్ విండో అధ్యక్షులు గుండారపు కృష్ణారెడ్డి, బిఆర్ఎస్ పార్టీ పట్టణ అధ్యక్షులు బండారి బాల్ రెడ్డి లు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర తొలి గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ పలు సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి అమలు చేసిన ప్రపంచ దేశాలు మెచ్చుకున్న గొప్ప ముఖ్యమంత్రి కేసీఆర్ అని వారు కొనియాడారు.
తెలంగాణ రాష్ట్ర తొలి గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రజల సంక్షేమం కోసం పాటుపడినట్టు ప్రతిపక్ష నేత గా ప్రజల పక్షానా హుందాగా పోరాడుతామన్నారు.కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో పేర్కొన్న విధంగా ఆరు హామీలను నెరవేర్చాలని లేకుంటే ప్రజల పక్షానా పోరాడుతామని వారు అన్నారు.
ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ సభ్యురాలు ఎలగందుల అనసూయ నర్సింలు , ఎఎంసి మాజీ చైర్మన్ అందె సుభాష్ ఎఎంసి మాజీ ఉపాధ్యక్షులు బందారపు బాల్ రెడ్డి , డైరెక్టర్ మెండే శ్రీనివాస్ యాదవ్ , గంట బాలా గౌడ్ , బిఆర్ఎస్ పార్టీ నాయకులు నంది కిషన్ , నేవూరి నవ జీవన్ రెడ్డి, ఎలగందుల బాబు, గోషిక దేవదాస్, పునుగోటి సత్యం రావు , రవి , దూస శ్రీనివాస్ , శ్రీనివాస్ గౌడ్, వివిధ గ్రామాల ప్రజలు తదితరులు పాల్గొన్నారు.