ఘనంగా అల్లు అర్జున్ చెల్లెలు నిశ్చితార్థం.. వైరల్ అవుతున్న వీడియో?

ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీలో వెడ్డింగ్ బెల్స్ మోగుతున్న సంగతి మనకు తెలిసిందే.ఎంతోమంది సినిమా సెలబ్రిటీలు బుల్లితెర నటీనటులు పెళ్లి చేసుకుని కొత్త జీవితంలోకి అడుగుపెడుతున్నారు.

 Allu Arjun's Younger Sister Engagement Photos Viral On Social Media, Allu Arjun,-TeluguStop.com

అదేవిధంగా మరికొంతమంది స్టార్ సెలబ్రిటీల పిల్లలు కూడా పెళ్లి పీటలు ఎక్కబోతున్న సంగతి మనకు తెలిసిందే.ఇప్పటికే వెంకటేష్, అర్జున్ కుమార్తెలు ఎంతో ఘనంగా నిశ్చితార్థం జరుపుకున్నారు.

అలాగే అభిరామ్, వరుణ్ తేజ్ వంటి వారందరూ కూడా పెళ్లిళ్లు చేసుకొని కొత్త జీవితంలోకి అడుగు పెట్టారు.ఇలా బుల్లితెర నటీనటుల నుంచి మొదలుకొని వెండితెర నటీనటులు కూడా పెళ్లిళ్లు చేసుకుంటున్న సంగతి తెలిసిందే.

ఇకపోతే అల్లు అర్జున్( Allu Arjun ) చెల్లెలు ఎంగేజ్మెంట్ కూడా ఘనంగా జరిగింది అంటూ సోషల్ మీడియాలో ఒక వీడియో వైరల్ గా మారింది.అసలు అల్లు అర్జున్ చెల్లెలు నిశ్చితార్థం జరగడం ఏంటి అల్లు అర్జున్ కి చెల్లెలు లేరు కదా అన్న సందేహం అందరిలోనూ కలగవచ్చు అల్లు అర్జున్ హీరోగా నటించిన పుష్ప( Pushpa ) సినిమా ఎలాంటి సక్సెస్ అందుకుందో మనకు తెలిసిందే.

ఈ సినిమా ద్వారా ఈయన పాన్ ఇండియా హీరోగా పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నారు.ఇక ఈ సినిమాలో అల్లు అర్జున్ తల్లి పాత్రలో బుల్లితెర నటి కల్పలత ( Kalpalatha ) నటించిన సంగతి తెలిసిందే.

ఈమె అల్లు అర్జున్ కి మదర్ క్యారెక్టర్ లో ఎంతో అద్భుతంగా సూట్ అయ్యారు.అయితే అల్లు అర్జున్ కంటే ఈమె వయసులో కేవలం రెండు సంవత్సరాలు మాత్రమే పెద్దది అనే విషయాన్ని ఈ సినిమా ప్రమోషన్ల టైంలో తెలియజేశారు.నా వయసు గురించి అల్లు అర్జున్ గారు అడిగి ఆశ్చర్యపోయారని అమ్మ మీ కంటే నేను రెండు సంవత్సరాలు మాత్రమే చిన్నవాడిని అంటూ చాలా ఆశ్చర్యపోయారు అంటూ కూడా కల్పలత చెప్పినటువంటి ఈ వ్యాఖ్యలు అప్పట్లో వైరల్ అయ్యాయి.అల్లు అర్జున్ కి తల్లి పాత్రలో నటించినటువంటి ఈమెకు ఇద్దరు కుమార్తెలని వీరు ఫారెన్ లో ఉద్యోగాలు చేస్తున్నారు అంటూ కూడా ఈమె తెలియజేశారు.

ఈ క్రమంలోనే కల్పలత తన పెద్ద కుమార్తెకు ఎంతో ఘనంగా నిశ్చితార్థం( Engagment ) జరిపించారని తెలుస్తుంది.ప్రస్తుతం ఇందుకు సంబంధించినటువంటి వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో పలువురు అల్లు అర్జున్ చెల్లెలు నిశ్చితార్థం అంటూ ఈ వీడియోని వైరల్ చేస్తున్నారు.ఇక కల్పలత తన కుమార్తె నిశ్చితార్థ వేడుకను ఎంతో ఘనంగా చేశారని తెలుస్తుంది.ఈ వేడుకకు ప్రముఖ డైరెక్టర్ సుకుమార్ ( Sukumar ) కూడా హాజరయ్యారని తెలుస్తోంది.

ఇలా కల్పలత కుమార్తె నిశ్చితార్థపు వేడుకకు సంబంధించిన ఈ వీడియో వైరల్ గా మారింది.ఇక ఈమె ప్రస్తుతం పలు సినిమాలతో పాటు పుష్ప 2(Pushpa 2)సినిమా షూటింగ్లో కూడా బిజీగా ఉన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube