తమిళ్ సినిమా ఇండస్ట్రీలో రజనీకాంత్( Rajinikanth ) కమలహాసన్ ఇద్దరిని ఇద్దరిని రెండు కన్నులుగా చూస్తూ ఉంటారు.వీళ్ళిద్దరూ తమదైన రీతిలో వరుస సక్సెస్ లు కొట్టడంలో ఎప్పుడు ముందు వరుసలో ఉంటారు.
ఇక ఇలాంటి క్రమంలో వాళ్ళిద్దరి సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద పోటీ పడుతూ ఉంటాయి.అయితే కొన్నిసార్లు రజనీకాంత్ సినిమాలు విజయం సాధిస్తే మరి కొన్నిసార్లు కమలహాసన్ సినిమాలు కూడా మంచి విజయాలు సాధించి ఒకరి మీద ఒకరు ఆధిపత్యాన్ని కొనసాగిస్తూ ఉంటారు.
కానీ నిజానికి వీళ్ళిద్దరూ బయట మంచి ఫ్రెండ్స్ గా ఉంటారు.

ఎప్పుడైనా సరే ఇద్దరూ కలుసుకొని చాలా సార్లు మాట్లాడుకుంటూ సినిమాల గురించి పర్సనల్ విషయాల గురించి కూడా డిస్కస్ చేసుకునేంత చనువు వీళ్ళ మధ్యన ఉంది.అయితే ఒకానొక సందర్భంలో కమలహాసన్ రజనీకాంత్( Kamal Haasan ) కంటే సీనియర్ హీరోగా మంచి గుర్తింపును సంపాదించుకున్నాడు.అయినప్పటికీ రజనీకాంత్ మాత్రం మాస్ సినిమాలను ఎక్కువగా చేస్తూ కమలహాసన్ కంటే కూడా పెద్ద రేంజ్ కి వెళ్లి తమిళ్ సినిమా ఇండస్ట్రీలోనే సూపర్ స్టార్ గా గుర్తింపు పొందాడు.
అందుకే కమలహాసన్ కంటే కూడా రజినీకాంత్ చాలా పెద్ద హీరో అంటూ చాలామంది అభివర్ణిస్తూ ఉంటారు.కమలహాసన్ క్లాస్ సినిమాలు చేస్తూ క్లాస్ ఆడియెన్స్ ని మాత్రమే మెప్పిస్తాడు.

కానీ రజనీకాంత్ క్లాస్ మాస్ సినిమాలు చేస్తూ ఆల్ టైప్ ఆఫ్ ఆడియన్స్ ని మెప్పించడంలో సక్సెస్ అవుతూ ఉంటాడు.అందుకే తెలుగులో కూడా కమలహాసన్ కంటే రజినికాంత్ ఎక్కువగా ఫ్యాన్స్ ని సంపాదించుకున్నాడు… ఇక ఇప్పుడు కూడా వీళ్లిద్దరూ తమ సినిమాలను రీ రిలీజ్ చేస్తూ ఉండటం తో ఇప్పుడు కూడా వీళ్ల మధ్య పోటీ అనేది కొనసాగుతుంది.ఇక రిలీజ్ అప్పుడే కాదు రీ రిలీజ్ టైం లో కూడా వీళ్ళ మధ్య పోటీ ఉండడం అనేది నిజంగా అభిమానులకి ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది.ఇక రజనీకాంత్ ముత్తు సినిమాని రీ రిలీజ్ చేస్తుండగా, కమలహాసన్ అభయ్ సినిమా( Abhay )ని రిలీజ్ చేస్తున్నాడు.
మరి ఈ పోటీలో ఎవరు గెలుస్తారు అనేది చూడాలి…








