సినిమా ఇండస్ట్రీలో ఉన్న చాలా మంది డైరెక్టర్లు వాళ్ళకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు సంపాదించుకోవడమే కాకుండా అహర్నిశలు సినిమా కోసం కష్టపడుతూ మంచి సినిమాలు చేయడానికి ఆసక్తిని చూపిస్తున్నారు.ఇక ఈ క్రమంలోనే వాళ్ళు చేసిన చాలా సినిమాలు ఇండస్ట్రీలో వరుసగా సక్సెస్ సాధించడంతో పాటుగా కొన్నిసార్లు నిరాశ పరుస్తున్నాయి.

ముఖ్యంగా సినిమా ఇండస్ట్రీలో ఉన్న ఒక టాప్ డైరెక్టర్ సినిమాలు చేయకుండా ఖాళీగా ఉంటున్నాడు ఆయనే వివి వినాయక్( V V Vinayak )… ఈయన భారీ అంచనాలతో బెల్లం కొండ శ్రీనివాస్( Bellamkonda Sai Sreenivas ) తో బాలీవుడ్ లో ఛత్రపతి సినిమా రీమేక్( Chatrapathi ) చేశాడు.ఆ సినిమా భారీ డిజాస్టర్ అయింది.దాంతో ఇప్పుడు అతనికి అవకాశం ఇచ్చే హీరోనే కరువ్వడనే చెప్పాలి.ఒకప్పుడు ఆయనతో సినిమా చేయడానికి స్టార్ హీరోలు సైతం ఉత్సాహం చూపించేవారు కానీ ఇప్పుడు సీన్ మొత్తం రివర్స్ అయిపోయింది.</br

ఆయనతో సినిమా చేయడానికి హీరోలు అవకాశాలు ఇచ్చే ఛాన్స్ అయితే లేదు మరి ఆయన ఎందుకిలా మారిపోయాడు అనే దానిమీదనే సర్వత్రా ఆసక్తి నెలకొంది.ఒకప్పుడు మంచి మేకర్ గా పేరు పొందిన ఈయన సడన్ గా ఇలా ఇండస్ట్రీ నుంచి ఫేడ్ అవ్వడానికి చాలా కారణాలు ఉన్నాయి.ఆయన ప్రస్తుతం సినిమాల మీద పెద్దగా ఇంట్రెస్ట్ పెట్టడం లేదు.ఆయన కి పర్సనల్ ప్రాబ్లమ్స్ కూడా కొంచం ఎక్కువ గా పెరిగినట్టు గా తెలుస్తుంది.
దానివల్లే ఆయన ప్రస్తుతానికి సినిమాల మీద ఫోకస్ అయితే పెట్టలేక పోతున్నాడు.ఇక ఫ్యూచర్ లో అయిన ఒక మంచి సినిమా తో మళ్ళీ బౌన్స్ బ్యాక్ అవ్వాలని కోరుకుందాం…ఎందుకంటే ఇలాంటి టాలెంట్ ఉన్న డైరెక్టర్ ఖాళీ గా ఉండటం కరెక్ట్ కాదు.
ఆయన సినిమాల్లో ఆయన చూపించిన హీరోయిజానికి ఇప్పటికీ కూడా ఆయనకి చాలా మంది అభిమానులు ఉన్నారు…
.







