ఏపీ ప్రభుత్వం యువ న్యాయవాదులకు ఆర్థిక సాయం చేస్తోన్న విషయం తెలిసిందే.ఈ మేరకు కొత్తగా లా గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన యువ లాయర్లు వృత్తిలో నిలదొక్కుకునేందుకు గానూ మూడు సంవత్సరాల పాటు వైసీపీ సర్కార్ ఆర్థికసాయం చేస్తోంది.
ఈ క్రమంలోనే వైఎస్ఆర్ లా నేస్తం పథకం కింద రెండో విడత నిధులను సీఎం జగన్ విడుదల చేశారు.ఒక్కొక్కరికి ఏడాదికి రూ.60,000 చొప్పున రెండు దఫాల్లో చెల్లిస్తూ మూడేళ్లకు మొత్తం రూ.1,80,000 ఆర్థికసాయం అందిస్తుంది.కాగా ఈ పథకం ద్వారా సుమారు 2,807 మంది జూనియర్ లాయర్లు లబ్దిపొందుతున్నారు.ఈ నాలుగున్నరేళ్ల కాలంలో ఇప్పటివరకు 6,069 మంది న్యాయవాదులకు రూ.49.51 కోట్లు అందించింది.