ఏపీలో ఇటీవల మిగ్జామ్ తుఫానుతో భారీగా పంట నష్టం వాటిల్లిన సంగతి తెలిసిందే.ఈ మేరకు పంట నష్టాన్ని అంచనా వేసేందుకు ప్రత్యేక బృందాలను ప్రభుత్వం నియమించింది.
ఈ క్రమంలోనే కేంద్ర ప్రత్యేక బృందాలు ఇవాళ్టి నుంచి క్షేత్రస్థాయికి పరిశీలనకు వెళ్లనున్నారు.ఇందులో భాగంగానే పంటలను పరిశీలించి నష్టంపై అంచనా వేయనున్నారు.
అలాగే ఈనెల 18 నుంచి ఆర్బీకే కేంద్రాల్లో సామాజిక తనిఖీలు నిర్వహించనున్నారు.ఈనెల 25న లబ్దిదారుల జాబితాను సిద్ధం చేస్తారు.
ఇంకా మిగిలిన వారి కోసం 31 వరకు దరఖాస్తుదారులకు అవకాశం కల్పించనున్నారు.ఈ క్రమంలో 31న తుది జాబితాను తయారు చేయనున్న అధికారుల బృందం సంక్రాంతిలోగా పంటనష్టం పరిహారాన్ని ప్రభుత్వం రైతుల ఖాతాల్లో జమ చేయనుంది.







