Nandu: గీతా మాధురిని వేధిస్తున్నానని పోలీసులు పట్టుకున్నారు.. నటుడు నందు కామెంట్స్ వైరల్..!!

నటుడు నందు( Actor Nandu ) ఈ మధ్యకాలంలో కొన్ని సినిమాల్లో హీరోగా చేస్తున్న నందు అప్పట్లో చాలా సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా చేశారు.అలా 100% లవ్, జయ జానకి నాయక, రాజు గారి గది 2, పెళ్లిచూపులు, సమ్మోహనం వంటి సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా చేశారు.

 Actor Nandu Viral Comments On Geetha Madhuri-TeluguStop.com

అంతేకాకుండా బొమ్మ బ్లాక్ బస్టర్ ( Bomma Blockbuster ) అనే సినిమాలో హీరోగా చేశారు.ఇక కేవలం సినిమాలు మాత్రమే కాకుండా కొన్ని వెబ్ సిరీస్ లు కూడా చేస్తూ నందు బిజీబిజీగా ఉంటున్నారు.

ఈయన తాజాగా చేసిన వధువు అనే వెబ్ సిరీస్ అమెజాన్లో స్ట్రీమింగ్ అవుతోంది.ఇందులో హీరోయిన్ గా అవికా గోర్ చేసింది.

ఇదిలా ఉంటే ఈ వెబ్ సిరీస్ ప్రమోషన్స్ లో భాగంగా గీత మాధురి ( Geetha madhuri ) గురించి ఒక షాకింగ్ విషయాన్ని బయట పెట్టారు నందు.ఆయన ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.

గీత చాలా తెలివిగలది.

Telugu Love, Nandu, Avika Gor, Pellichupulu, Geetha Madhuri, Vadhuvu Web-Movie

ఆమె ఏదైనా చూస్తే ఇట్టే నేర్చేసుకుంటుంది.అలా మేము లండన్( London ) వెళ్ళిన సమయంలో క్యాసినో చూసి కొద్దిగంటల్లోనే ఆట నేర్చేసుకుంది.అంతేకాదు ఆమెకి క్యాసినో ఆటడం అంటే చాలా ఇష్టం.

కానీ ప్రస్తుతం అయితే ఎక్కువగా ఆడడం లేదు.దానికి ప్రధాన కారణం మేము న్యూజిలాండ్, కాలిఫోర్నియా వెళ్ళిన సమయంలో ఓసారి క్యాసినో ఆడి ఎంత పిలిచినా కూడా రాలేదు.

కానీ ఆమె ఎన్ని డబ్బులు పెట్టినా కూడా అవన్నీ కోల్పోయింది.అలా డబ్బు మొత్తం పోగొట్టింది.

Telugu Love, Nandu, Avika Gor, Pellichupulu, Geetha Madhuri, Vadhuvu Web-Movie

దాంతో ఎన్ని సార్లు పిలిచినా రాకపోయేసరికి కోపంతో చేతిలో డబ్బులు విసిరి కొట్టి నేను వెళ్తున్నాను అని బయటికి వచ్చేసాను.ఇక నా కోపాన్ని చూసి గీత మాధురి వెంటనే బయటికి వచ్చేసి బుజ్జి సారీ అంటూ నన్ను కన్విన్స్ చేసే ప్రయత్నం చేసింది.కానీ నేను ఎంతకు కాన్విన్స్ అవ్వకపోయేసరికి అక్కడే ఉన్న పోలీసులు నేను గీత మాధురిని వేధిస్తున్నాను కావచ్చు అని నన్ను అరెస్టు చేయాలని చూశారు.కానీ అక్కడ మేమిద్దరం వైఫ్ అండ్ హస్బెండ్ అని చెప్పి వచ్చేసాం.

అలా ఆరోజు గీత మాధురి వల్ల పోలీసులకు చిక్కాను.ఇక అప్పటినుండి క్యాసినో ఎక్కువగా ఆడం లేదు.

ఒకవేళ ఆడినా కూడా ఐదు పదివేల కంటే ఎక్కువ డబ్బులు పెట్టడం లేదు.ఇక గత కొన్ని రోజులుగా గీత మాధురి కి నాకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో పోస్ట్ చేయకపోవడం వల్ల చాలామంది మేమిద్దరం విడాకులు తీసుకుంటున్నామని భావించారు.

కానీ అందులో ఎలాంటి నిజం లేదు.అంటూ నటుడు నందు చెప్పుకొచ్చారు.

ప్రస్తుతం నందు మాట్లాడిన మాటలు నెట్టింట్లో వైరల్ గా మారాయి

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube