ఉత్తరప్రదేశ్ లోని బరేలీలో ఘోర రోడ్డుప్రమాదం జరిగింది.ఈ ఘటనలో ఎనిమిది మంది సజీవ దహనం అయ్యారు.
పెళ్లి వేడుకకు హాజరై తిరిగి వస్తున్న సమయంలో అదుపుతప్పిన ఓ కారు ట్రక్కును ఢీకొట్టింది.దీంతో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో ట్రక్కు, కారులో మంటలు వేగంగా వ్యాపించాయి.
నైనిటాల్ రహదారిపై ఈ ప్రమాదం చోటు చేసుకుంది.కాగా కారు టైర్ పేలడంతో అదుపుతప్పి ట్రక్కును ఢీకొట్టిందని తెలుస్తోంది.
స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు.అనంతరం ప్రమాదంపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.







