వీడియో: చొక్కా లోపల స్మార్ట్ డివైజ్‌.. లాగుతూ బాడీ కూల్ చేస్తోందిగా..!

ఈ రోజుల్లో అన్ని పనులను సులభతరం చేసే స్మార్ట్ గ్యాడ్జెట్స్‌( Smart gadgets ) అందుబాటులోకి వస్తున్నాయి.మామూలుగా ఎండాకాలం లేదా ఉష్ణోగ్రత ఎక్కువగా ఉన్న సమయంలో మనం చొక్కాని కిందికి, పైకి ఆడిస్తూ శరీరానికి గాలి తగిలేలా చేస్తాము.

 Video: Smart Device Inside The Shirt While Pulling The Body Cools , Viral Video-TeluguStop.com

చెమట ఆరిపోయేందుకు ఈ టెక్నిక్ చాలామంది ఉపయోగిస్తారు.అయితే ఆ పనిని కూడా చేసే ఒక గ్యాడ్జెట్‌ను తాజాగా డెవలపర్లు తయారు చేశారు.

ఇది ఎలా పని చేస్తుందో చూపించే ఒక వీడియో ప్రస్తుతం సోషల్ మీడియా( Social media )లో వైరల్ గా మారింది.

వైరల్ అవుతున్న వీడియోలో ఒక మనిషి టీ షర్ట్( T-shirt ) ధరించి నిలబడడం మనం చూడవచ్చు.అతను తన ప్యాంటుకి ఒక డివైజ్‌ యాడ్ చేశాడు.ఆ డివైజ్‌ కు ఉన్న ముందు పార్ట్ ను టీ షర్టుకు తగిలించాడు.

అనంతరం దాన్ని ఆన్ చేయగానే అది షర్టును ముందుకు, వెనుకకు లాగుతూ పనిచేసింది.ఇలా షర్టు ఆడించడం వల్ల ఆ సమయంలో అతడి శరీరానికి గాలి తగిలింది.

అప్పుడు అతడు చాలా హాయిగా ఫీలవుతున్నట్లు చేతులు చాచి నవ్వాడు.

@gunsnrosesgir3 దీనికి సంబంధించిన వీడియోను షేర్ చేసింది.దీనికి ఇప్పటికే 86 లక్షల పైగా వ్యూస్ వచ్చాయి.7 వేలకు పైగా లైక్స్ వచ్చాయి.అయితే బస్సులో కూర్చుని ఈ డివైజ్‌ ఆన్ చేస్తే ఇతరులు చాలా తప్పుగా అర్థం చేసుకుంటారని ఒక వ్యక్తి అన్నాడు.దీన్ని ఆన్ చేసినప్పుడు చేతులు రెండు పక్కకు ఉంచుకొని ఉండాలి, లేదంటే ఇది ఓ అసభ్యకర చర్యగా ఇతరులకు కనిపిస్తుందని మరొకరు అన్నారు.

దీనిని తొడుక్కోవడం వల్ల కలిగే ప్రయోజనాల కంటే నష్టాలే ఎక్కువ అని మరికొందరు వ్యాఖ్యానించారు.దీన్ని ఎవరూ కొనుగోలు చేయరని ఇంకొందరు పేర్కొన్నారు.మొత్తం మీద ఈ డివైజ్‌కు ఎక్కువగా నెగిటివ్ ఫీడ్ బ్యాక్ వచ్చింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube