మన టాలీవుడ్ లో బిగ్గెస్ట్ సూపర్ స్టార్స్ ఎవరు అని అడిగితే ఎవరికైనా ముందు గుర్తుకు వచ్చే పేరు సూపర్ స్టార్ మహేష్ బాబు( Mahesh Babu ) మరియు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.( Pawan Kalyan ) రాజమౌళి తర్వాత టాలీవుడ్ మార్కెట్ వేల్యూ పెరిగింది వీళ్లిద్దరి వల్లే అని చెప్పడం లో ఎలాంటి సందేహం లేదు.
మరో విశేషం ఏమిటంటే అప్పుడప్పుడే ఓవర్సీస్ మార్కెట్ ని సంపాదించుకుంటున్న మన టాలీవుడ్ కి 1 మిలియన్ మార్కు ని అందుకున్న సినిమాలను అందించారు వీళ్లిద్దరు.ప్రస్తుతం మిగిలిన హీరోల మార్కెట్ తో పోలిస్తే వీళ్ళిద్దరిది తక్కువే అని చెప్పాలి.
ఎందుకంటే మిగిలిన హీరోలు పాన్ ఇండియా రేంజ్ వెళ్లారు, వీళ్ళిద్దరూ ఇంకా ప్రాంతీయ బాషా చిత్రాలకు మాత్రమే పరిమితం అయ్యారు.వచ్చే ఏడాది వీళ్లిద్దరు కూడా పాన్ ఇండియన్ మార్కెట్ లోకి అడుగుపెట్టబోతున్నారు.
అప్పుడు వీళ్ళ రేంజ్ ఎలా ఉంటుందో చూడాలి.

ఇదంతా పక్కన పెడితే వీళ్లిద్దరు కలుసుకున్న సందర్భాలు చాలా తక్కువగానే ఉంటాయి.కానీ ఒకరంటే ఒకరికి ఎంతో అభిమానం.ఒకరిని ఒకరు పొగడాల్సిన సందర్భం వచ్చినప్పుడు కచ్చితంగా పొగుడుకుంటారు.
సోషల్ మీడియా సాక్షిగా ఎన్నోసార్లు ఇది జరిగింది.ఇదంతా పక్కన పెడితే మహేష్ బాబు జనసేన పార్టీ కి( Janasena Party ) తెగ సపోర్ట్ చేసేస్తున్నాడు.
అసలు రాజకీయాలకు సంబంధమే లేదు అని చెప్పుకునే మహేష్ బాబు ఏంటి, జనసేన కి సపోర్టు చెయ్యడం ఏమిటి అని మీరు అనుకోవచ్చు.అది ముమ్మాటికీ నిజమే, మహేష్ బాబు కి రాజకీయాలకు ఎలాంటి సంబంధాలు లేవు.
కానీ జనసేన పార్టీ కి ఎందుకు సపోర్ట్ అని అంటున్నాము అంటే, రీసెంట్ గా ఆయన హీరో గా నటించిన సినిమాలన్నిట్లో గాజు గ్లాస్ ని తెగ వాడేస్తున్నాడు.గాజు గ్లాస్( Glass Symbol ) జనసేన పార్టీ గుర్తు అనే విషయం మన అందరికీ తెలిసిందే.

మహర్షి, భరత్ అనే నేను , సర్కారు వారి పాట ఇప్పుడు రీసెంట్ గా విడుదల అవుతున్న గుంటూరు కారం ,( Guntur Karam ) ఇలా అన్నీ సినిమాలలో కూడా మహేష్ బాబు గాజు గ్లాస్ ని మెయిన్ గా హైలైట్ చేస్తూ పోస్టర్స్ విడుదల చెయ్యడం ఇరువురి హీరోల అభిమానులకు చాలా సంతోషాన్ని కలిగించింది.నిన్న ఈ చిత్రానికి సంబంధించిన రెండవ పాట ‘ఓహ్ మై బేబీ’ పోస్టర్ ని విడుదల చేసారు.ఈ పాటని 13 వ తారీఖున విడుదల చేస్తున్నట్టుగా అధికారిక ప్రకటన కూడా చేసారు.అయితే ఈ పోస్టర్ లో మహేష్ బాబు పక్కన గాజు గ్లాస్ ఉంది.
దీనిని పవన్ కళ్యాణ్ అభిమానులు హైలైట్ చేసి మహేష్ మరోసారి గాజు గ్లాస్ గుర్తుని ప్రచారం చేస్తున్నాడు అంటూ సోషల్ మీడియా లో పోస్టులు పెడుతున్నారు.







