సంగారెడ్డి జిల్లా అధికారులకు కాంగ్రెస్ నేత, మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి హుకుం జారీ చేశారని తెలుస్తోంది.ఈ మేరకు కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో అన్ని ప్రభుత్వ కార్యక్రమాలకు తన సతీమణిని ఆహ్వానించాలని తెలిపారు.
తన సతీమణి కాంగ్రెస్ జిల్లా అధ్యక్షురాలన్న జగ్గారెడ్డి ప్రభుత్వ కార్యకలాపాలకు తప్పకుండా ఆమెను ఆహ్వానించాలని అధికారులకు సూచించారని తెలుస్తోంది.టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఈ విషయాన్ని వెల్లడిస్తున్నట్లు స్పష్టం చేశారు.
జగ్గారెడ్డి అంటే హుందా కలిగిన నేతనని, ఎప్పుడూ చిల్లర రాజకీయాలకు పాల్పడలేదని తెలిపారు.ఏ కార్యక్రమం అయినా తన భార్య నిర్మలకు సమాచారం ఇవ్వాలని చెబుతున్నట్లు అందరూ జిల్లాలోని అన్ని శాఖల అధికారులకు చెబుతున్నట్లు వెల్లడించారు.







