నెల రోజుల క్రితం దక్షిణ లండన్‌లోని క్రోయ్‌డాన్‌లోని హత్యకు గురైన మెహక్ శర్మ( Mehak Sharma ) అనే మహిళ మృతదేహం ఎట్టకేలకు భారతదేశం చేరింది.పంజాబ్‌లోని అమృత్‌సర్ అంతర్జాతీయ విమానానికి( Amritsar International Airport ) శనివారం ఆమె భౌతికకాయం చేరుకుంది.
అక్టోబర్ చివరిలో మెహక్ శర్మను కట్టుకున్న భర్తే దారుణంగా హతమార్చాడు.ఈ కేసుకు సంబంధించి గురుదాస్‌పూర్‌లోని సంత్‌నగర్‌లో నివసిస్తున్న ఆమె అత్తమామలను కూడా అరెస్ట్ చేయాలని మెహక్ శర్మ కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు.
మృతురాలి తల్లి మధుబాల, బంధుమిత్రులు విమానాశ్రయానికి చేరుకుని మెహక్ శర్మ మృతదేహాన్ని స్వీకరించారు.లండన్‌లో మెహక్ భర్త ఆమెను శారీరకంగా , మానసికంగా వేధిస్తున్నా అత్తమామలు ఏమాత్రం పట్టించుకోలేదని మధుబాల ఆరోపించారు.
భారత్‌కు తిరిగి రావాలంటే నగదు ఇవ్వాలంటూ వారు తన కుమార్తెను వేధించారని ఆమె మండిపడ్డారు.
గురుదాస్‌పూర్‌లోని జోగి చీమా గ్రామానికి చెందిన మెహక్ శర్మకు గతేడాది జూన్ 24న సాహిల్ శర్మతో( Sahil Sharma ) వివాహం జరిగింది.
పెళ్లయిన ఆరు నెలలకు ఆమె లండన్( London ) వెళ్లగా.ఆ వెంటనే స్పౌజ్ వీసాపై సాహిల్ కూడా యూకేకు వెళ్లాడు.అయితే అక్కడికి వెళ్లిన మరుక్షణం నుంచి సాహిల్ నిజస్వరూపం బయటపడిందని మధుబాల ఆరోపించారు.తన పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడని మెహక్ ఎన్నోసార్లు తనతో చెప్పుకుని బాధపడిందని మధుబాల కన్నీటి పర్యంతమయ్యారు.

ఆ తర్వాత రెండు రోజుల పాటు కూతురి నుంచి ఫోన్ రాకపోవడంతో యూకేలో ఉంటున్న తన బంధువును ఆమె ఇంటికి పంపించానని మధుబాల తెలిపారు.ఇంతలో మెహక్ హత్యకు గురైందని లండన్ మెట్రోపాలిటన్ పోలీసులు( London Metropolitan Police ) సాహిల్‌ను అదుపులోకి తీసుకున్నారని ఆ బంధువు పిడుగులాంటి వార్త చెప్పాడు.ఈ ఘటన మెహక్ కుటుంబంలో తీరని విషాదాన్ని నింపింది.

మెహక్ శర్మ. ఫ్యాబలస్ హోమ్‌కేర్ లిమిటెడ్‌లో కేర్‌టేకర్‌గా పనిచేస్తోంది.ఇది క్రోయ్‌డాన్( Croydon ) కేంద్రంగా నడుస్తోన్న హోమ్‌కేర్ ప్రొవైడర్.
కాంగ్రెస్ నేత వికాస్ సోనీ బాధితురాలి కుటుంబ సభ్యులను పరామర్శించి సంతాపం తెలిపారు.విపక్ష నేత పర్తాప్ సింగ్ బజ్వా చొరవ కారణంగా మెహక్ మృతదేహం భారత్‌కు చేరుకుంది.
మెహక్ అత్తమామలపై చర్యలు తీసుకునేలా తాను ప్రభుత్వాన్ని కోరుతున్నట్లు సోనీ తెలిపారు.







