తమ్ముడు రాయితో కొట్టాడని పగ పెంచుకున్న అన్న, అవకాశం కోసం ఎదురు చూసి గొడ్డలితో విచక్షణారహితంగా తమ్ముడిని నరికి చంపిన ఘటన అనంతపురం జిల్లా ( Anantapur District )శెట్టూరు మండలంలోని కనుకూరు గ్రామంలో( Kankur village ) చోటు చేసుకుంది.అందుకు సంబంధించిన వివరాలు ఏమిటో చూద్దాంపోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.
కనుకూరు గ్రామంలో నివాసం ఉంటున్న గొల్ల గోపాల్, మల్లక్క దంపతులకు రవి,కృష్ణ మూర్తి,భారతి అనే ముగ్గురు పిల్లలు సంతానం.వీరి కుటుంబం కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తోంది.
గోపాల్ కు మతిస్థిమితం లేదు.పెద్ద కుమారుడు రవి కుటుంబ బాధ్యతలు పట్టించుకునే వాడు కాదు.
రెండో కుమారుడు కృష్ణమూర్తి సెంట్రింగ్ పనులు చేస్తూ కుటుంబ భారం అంతా తానే మోసేవాడు.

అన్నదమ్ములైన రవి, కృష్ణమూర్తి మధ్య అప్పుడప్పుడు చిన్న గొడవలు జరుగుతూ ఉండేవి.ఆ తర్వాత మళ్లీ వీరు కలిసి పోయేవారు.అయితే గురువారం ఉదయం రవి తన తమ్ముడి సెల్ ఫోన్ తీసుకుని చెప్పకుండా కళ్యాణదుర్గం వెళ్ళాడు.
తమ్ముడు కృష్ణమూర్తి కళ్యాణదుర్గం వెళ్లి తన ఫోన్ ఇవ్వాలంటూ అన్నతో గొడవపడ్డాడు.ఈ క్రమంలోనే ఒక రాయితో అన్న రవి తలపై కొట్టడంతో స్వల్ప గాయం అయింది.
అక్కడ ఉండే స్థానికులు అన్నదమ్ములను మందలించారు.ఆ తరువాత తమ్ముడు కృష్ణమూర్తి, రవిని ఆసుపత్రికి తీసుకెళ్లి చికిత్స చేయించి, తనతో పాటే ద్విచక్ర వాహనంపై ఇంటికి తీసుకొచ్చాడు.
తమ్ముడు పై కోపం పెంచుకున్న రవి గురువారం అర్ధరాత్రి తమ్ముడిని గొడ్డలితో విచక్షణారహితంగా నరికి చంపేశాడు.

శుక్రవారం ఉదయం చిన్న కుమారుడు కృష్ణమూర్తి రక్తపు మడుగులో పడి ఉండడం చూసి తల్లి మల్లక్క ఏడుస్తూ కేకలు వేసింది.దీంతో చుట్టుపక్కల ఉండే వారంతా సంఘటన స్థలానికి వచ్చి పోలీసులకు సమాచారం అందించారు.పోలీసులు సంఘటన స్థలాన్ని పరిశీలించి మృతదేహాన్ని( Dead body ) పోస్ట్మార్టం నిమిత్తం కళ్యాణదుర్గం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
పెద్ద కుమారుడు రవిని పోలీసులు ( Police )అదుపులోకి తీసుకున్నారుఒక కొడుకు హత్యకు గురి కావడం, మరోక కొడుకు జైలు పాలు కావడంతో ఆ తల్లిదండ్రుల వేదన వర్ణనాతీతంగా మారింది.








