దేశంలో జీవన వ్యయ సంక్షోభం నేపథ్యంలో కెనడా ప్రభుత్వం అంతర్జాతీయ విద్యార్ధులకు( International Students ) షాకిచ్చింది.కెనడాలో( Canada ) అడుగుపెట్టిన తర్వాత వారు తమను తాము పోషించుకునేందుకు అవసరమైన నిధుల మొత్తాన్ని రెట్టింపు కంటే ఎక్కువ చేస్తోంది జస్టిన్ ట్రూడో( Justin Trudeau ) ప్రభుత్వం.
ఇమ్మిగ్రేషన్, రెఫ్యూజీస్ అండ్ సిటిజన్‌షిప్ కెనడా (ఐఆర్‌సీసీ) ఈ విషయంలో కీలక ప్రకటన చేసింది.దీని ప్రకారం వచ్చే ఏడాది జనవరి 1 లేదా ఆ తర్వాత స్వీకరించబడిన కొత్త స్టడీ పర్మిట్ దరఖాస్తుల కోసం ఒక విదేశీ దరఖాస్తుదారుడు తమ వద్ద 20,635 కెనడా డాలర్లు (భారత కరెన్సీలో రూ.12.7 లక్షలు) వున్నట్లుగా చూపించాలని పేర్కొంది.ఇది గతంలో 10,000 కెనడియన్ డాలర్లు (భారత కరెన్సీలో రూ.6.14 లక్షలు)గా వుండేది.
ఈ మొత్తాన్ని ఎందుకు పెంచాల్సి వచ్చింది వివరిస్తూ కెనడా ప్రభుత్వం వివరణ ఇచ్చింది.2000 ప్రారంభంలో స్టడీ పర్మిట్ దరఖాస్తుదారుల( Study Permit Applicants ) జీవన వ్యయం ఒక్కో దరఖాస్తుదారుడికి 10,000 కెనడియన్ డాలర్లుగా నిర్ణయించారని, ఏళ్లు గడుస్తున్నా ఈ మొత్తంలో ఎలాంటి మార్పులు చోటు చేసుకోలేదని పేర్కొంది.ప్రస్తుత పరిస్ధితులు, ఆర్ధిక అవసరాల కారణంగా విద్యార్ధులు వారి వెంట తెచ్చుకునే ఈ నిధులు ఏమాత్రం సరిపోవడం లేదని విశ్లేషకులు అంటున్నారు.

ఈ క్రమంలో ఇమ్మిగ్రేషన్ మంత్రి మార్క్ మిల్లర్( Immigration Minister Marc Miller ) మాట్లాడుతూ.జీవన వ్యయ ప్రమాణాలను సవరించాలని నిర్ణయించినట్లు తెలిపారు.తద్వారా అంతర్జాతీయ విద్యార్ధులు ఇక్కడి నిజమైన వ్యయాన్ని అర్ధం చేసుకుంటారని మిల్లర్ ఆకాంక్షించారు.నిజానికి కెనడాలో వారి విజయానికి ఈ చర్యే కీలకమని ఆయన పేర్కొన్నారు.గృహ సంక్షోభం,( Housing Crisis ) అంతర్జాతీయ విద్యార్ధులు ఫుడ్ బ్యాంకులపై మొగ్గు చూపుతున్నారనే నివేదికల మధ్య కెనడా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకోవడం గమనార్హం.క్యాపింగ్ వీసాలతో సహా అంతర్జాతీయ విద్యార్ధులకు తగిన గృహాలను ఏర్పాటు చేయని విద్యాసంస్థలపై చర్య తీసుకునేందుకు కూడా ఐఆర్‌సీసీ చర్యలు తీసుకుంది.

కాగా.మెరుగైన జీవన ప్రమాణాలు, నాణ్యమైన విద్య, మంచి ఉద్యోగావకాశాలు వుండటంతో పలు దేశాల విద్యార్ధులు కెనడాకు క్యూ కడుతున్నారు.అలాగే సరళమైన ఇమ్మిగ్రేషన్ నిబంధనలు, వీసా జారీ, త్వరగా శాశ్వత నివాస హోదా వంటి అనుకూల అంశాలు కెనడా వైపు విద్యార్ధులను ఆకర్షిస్తున్నాయి.అయితే ప్రస్తుతం అక్కడ తీవ్ర గృహ సంక్షోభం ప్రభుత్వానికి తలనొప్పులు తీసుకొస్తోంది.
దీని కారణంగా అంతర్జాతీయ విద్యార్ధుల రాకపై ఆంక్షలు విధించాలని జస్టిన్ ట్రూడో సర్కార్ యోచిస్తోంది.ఇది రాజకీయంగానూ ట్రూడో ప్రభుత్వానికి కత్తిమీద సాము లాంటిది.గృహ సంక్షోభాన్ని అరికట్టడంతో పాటు దేశంలో శ్రామికుల కొరతను కూడా పరిష్కరించాల్సిన బాధ్యత ప్రధానిపైనే వుంది.దీంతో ఏం చేయాలో తెలియక ట్రూడో మల్లగుల్లాలు పడుతున్నారు.







