ఏపీలో పౌరవిమానయాన, పోర్టుల అభివృద్ధికి కేంద్రం సహకరిస్తుందని బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహ రావు అన్నారు.ఈ క్రమంలోనే ఈనెల 10వ తేదీన రాజమండ్రికి కేంద్రమంత్రి సింధియా వస్తున్నారని ఆయన తెలిపారు.
ఈ మేరకు రాజమండ్రి ఎయిర్ పోర్ట్ టెర్మినల్ విస్తరణ పనులకు కేంద్రమంత్రి సింధియా శంకుస్థాపన చేస్తారని ఎంపీ జీవీఎల్ పేర్కొన్నారు.అలాగే విశాఖ భోగాపురం ఎయిర్ పోర్టుకు కేంద్ర ప్రభుత్వం అన్ని అనుమతులు ఇచ్చిందని తెలిపారు.
భారత్ అభివృద్ధిలో విశాఖ గ్రోత్ ఇంజిన్ గా ఉండబోతుందని వెల్లడించారు.







