తెలంగాణ ఎన్నికల ఫలితాలపై టీడీపీ అధినేత చంద్రబాబు పరోక్షంగా స్పందించారని తెలుస్తోంది.ఏపీలో జగన్ ప్రభుత్వం అహంకారంతో ఉందని తెలిపారు.
అహంకారం ఉంటే ఏమవుతుంది అనేది తెలంగాణలో చూశామని చంద్రబాబు పేర్కొన్నారు.మరో మూడు నెలల వ్యవధిలోనే ఏపీలోనూ అదే పరిస్థితి చూస్తామని చెప్పారు.
గుంటూరు జిల్లా మంగళగిరి పరిధిలోని తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించిన ఆయన మాట్లాడుతూ ఎన్నికల ఫలితాలపై కీలక వ్యాఖ్యలు చేశారు.ఈ క్రమంలోనే ఏపీ ప్రజల కష్టాలు ఇక మూడు నెలలేనని వెల్లడించారు.







