Bichagadu 2 : జైలర్ కంటే బిచ్చగాడే తోపు.. ఈ మూవీ బుల్లితెర రేటింగ్ తెలిస్తే మాత్రం షాకవ్వాల్సిందే!

విజయ్ ఆంటోనీ( Vijay Antony ) హీరోగా నటించిన బిచ్చగాడు సినిమా గురించి మనందరికీ తెలిసిందే.అప్పట్లో విడుదలైన ఈ సినిమా ఎంతటి ప్రభంజనాన్ని సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.

 Bichagadu 2 Gets Good Trp In Telugu-TeluguStop.com

కేవలం వెండితెరపై మాత్రమే కాకుండా బుల్లితెరపై కూడా సంచలన రికార్డును సృష్టించింది.ఆ మూవీ సాధించిన రేటింగ్స్ ను టాలీవుడ్ సూపర్ స్టార్స్ కూడా ఒక దశలో అందుకోలేకపోయారు.

అయితే ఇప్పుడు బిచ్చగాడు-2 వంతు వచ్చింది.ఈ సినిమా థియేటర్ లలో ఆశించిన స్థాయిలో ఆడలేదు.

కానీ టీవీల్లో మాత్రం ఈ ఫ్రాంచైజీ హవా కొనసాగింది.

వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ గా బిచ్చగాడు-2( Bichagadu 2 )ను టెలికాస్ట్ చేస్తే, ఏకంగా 6.97 రేటింగ్ వచ్చింది.ఇది కూడా ఒక లెక్కేనా అంటే ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఇది పెద్ద లెక్కే అని చెప్పవచ్చు.

ఇంకా చెప్పాలంటే ఇటీవలే విడుదల అయిన రజినీకాంత్ జైలర్ సినిమా కంటే బిచ్చగాడు సినిమాకు మంచి రేటింగ్ వచ్చింది.సినిమాకు అన్ని తానై బిచ్చగాడు 2 సినిమాను తెరకెక్కించారు విజయ్ ఆంటోనీ.

సినిమాకు దర్శకత్వం వహించడంతోపాటు హీరోగా నటించి కథ అతనే రాసుకొని స్వయంగా సంగీతాన్ని అందించి తనే ఎడిటింగ్ చేసుకున్నాడు.ఇలా ప్రతి ఒక్కటి తనే స్వయంగా చేసుకున్నారు విజయ్ ఆంటోని.

అంతేకాకుండా ఈ సినిమాకు నిర్మాత కూడా విజయ్ ఆంటోనినే.15 కోట్ల రూపాయల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా బ్రేక్ ఈవెన్ సాధించింది.అంతేకాకుండా వసూళ్ల మోత మోగించింది.బిచ్చగాడు పార్ట్ వన్ విడుదల అయ్యి సంచలన విజయాన్ని నమోదు చేయగా పార్ట్-2 విడుదల అంతకు రెట్టింపు విజయాన్ని సాధించింది.అటు వెండితెరపై మాత్రమే కాకుండా బుల్లితెరపై కూడా భారీగా ప్రేక్షకాధరణను పొందింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube