నిరాశలో కిషన్ రెడ్డి !  తెలంగాణ బిజెపికి కొత్త అధ్యక్షుడు ? 

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో( Telangana assembly election ) బిజెపి 11 స్థానాల్లో పోటీ చేయగా,  ఎనిమిది స్థానాల్లో జనసేన పొత్తులో భాగంగా పోటీ చేసింది.అయితే జనసేన అన్ని స్థానాల్లోనూ ఓటమి చెందగా,  బిజెపి పోటీ చేసిన 111 స్థానాల్లో ఎనిమిది స్థానాలు మాత్రమే గెలుచుకోగలిగింది.

 Kishan Reddy In Despair! New President Of Telangana Bjp, Telangana Bjp, Telangan-TeluguStop.com

అసలు బీఆర్ఎస్ , కాంగ్రెస్ ( BRS, Congress )లకు ధీటుగా తెలంగాణలో అధికారంలోకి వస్తామని ధీమాను పోలింగ్ ముందు వరకు వ్యక్తం చేస్తూ వచ్చిన బిజెపి,  ఎన్నికల ఫలితాలు తర్వాత తీవ్ర నిరాశ చెందింది.తెలంగాణతో పాటు మిగతా మూడు రాష్ట్రాల్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బిజెపి గెలుపొందినా ,  తెలంగాణలో ఫలితాలు మాత్రం తీవ్రంగా నిరాశపరిచాయి .ముఖ్యంగా ఈ ఎన్నికల ఫలితాలపై తెలంగాణ బిజెపి అధ్యక్షుడు కిషన్ రెడ్డి తీవ్ర నిరాశలో ఉన్నారట.ఈ మేరకు తెలంగాణ బిజెపి అధ్యక్ష పదవికి రాజీనామా చేసే ఆలోచనలో కిషన్ రెడ్డి( Kishan Reddy ) ఉన్నట్లు సమాచారం.

లోక్ సభ ఎన్నికల వరకు పార్టీ పగ్గాలు కిషన్ రెడ్డినే చూడాలని అధిష్టానం చెబుతున్నా…  కిషన్ రెడ్డి మాత్రం అందుకు అంగీకరించడం లేదట.

Telugu Amith Sha, Kishan Reddy, Telangana Bjp, Telangana-Politics

అసలు తెలంగాణ బిజెపి అధ్యక్ష బాధ్యతలు స్వీకరించక ముందే ఈ విషయంపై షరతులు పెట్టారని , అసెంబ్లీ ఎన్నికలు ( Assembly elections )ముగిసే వరకే తాను అధ్యక్ష బాధ్యతలు స్వీకరిస్తానని చెప్పానని,  ఇప్పుడు ఆ తంతు పూర్తి కావడంతో రాజీనామా చేయాలని నిర్ణయించుకున్నారట.ఇటీవల తెలంగాణతో పాటు జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన మధ్యప్రదేశ్, రాజస్థాన్ , ఛత్తీస్ ఘడ్ రాష్ట్రాలకు ముఖ్యమంత్రుల నియామకం చేపట్టే విషయంలో బిజెపి అధిష్టానం బిజీగా ఉండడంతో పాటు,  పార్లమెంట్ సమావేశాలు కూడా జరుగుతున్నందున ఈ హడావుడి తగ్గిన తర్వాత తన పదవి విషయంలో బిజెపి( bjp ) అగ్ర నేతల వద్దే క్లారిటీ తీసుకోవాలనే ఆలోచనలో కిషన్ రెడ్డి ఉన్నారట.

Telugu Amith Sha, Kishan Reddy, Telangana Bjp, Telangana-Politics

ఈ నేపథ్యంలో తెలంగాణ బిజెపి అధ్యక్ష బాధ్యతలు మళ్లీ బండి సంజయ్ కు కానీ,  లేక ధర్మపురి అరవింద్ కి కానీ అప్పగించే ఆలోచనలో బిజెపి అధిష్టానం ఉందట.అయితే ఈ విషయంలో కిషన్ రెడ్డితో పూర్తిగా చర్చించిన తర్వాతే దీనిపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్లు సమాచారం.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube