ఈ ప్రపంచంలో కోట్లాది సంవత్సరాల క్రితం పుట్టిన కొన్ని జీవులు, అలాగే చెట్లు ఇప్పటికీ ఉనికిలో ఉండి అందరిని ఆశ్చర్యపరుస్తున్నాయి అలాంటి చెట్లలో ఒకటి జింగో చెట్టు.ఇది 300 మిలియన్ సంవత్సరాల క్రితం పాలియోజోయిక్ యుగానికి( Paleozoic Era ) చెందిన ఒక అద్భుతమైన చెట్టు జాతి.
ఈ యుగం డైనోసార్ల యుగానికి పూర్వం, జింగో చెట్లు ట్రైలోబైట్స్ వంటి సముద్ర జీవులతో భూమిని పంచుకున్న కాలం.ట్రైలోబైట్‌లు చాలా కాలంగా అంతరించిపోయినప్పటికీ, జింగో చెట్లు( Ginkgo Tree ) యుగయుగాలుగా కొనసాగుతున్నాయి.

దక్షిణ కొరియాలోని( South Korea ) బంగ్యే-రి గ్రామంలో( Bangye-ri Village ) ఒక జింగో చెట్టు ఉంది, ఇది సుమారు 800 సంవత్సరాల నాటిదని అంచనా.ఈ చెట్టు ఆకులు బంగారు వర్ణంలో మెరిసిపోతూ చాలామందిని ఆకట్టుకుంటాయి.దాని అద్భుతమైన ఆకులు, విశాలమైన కొమ్ములు ప్రపంచవ్యాప్తంగా పర్యాటకులను ఫిదా చేస్తాయి, ఇది ఈ భూగ్రహం పై అత్యంత అందమైన చెట్లలో ఒకటిగా గుర్తింపు పొందింది.కోవిడ్-19( Covid-19 ) మహమ్మారి సమయంలో చెట్టు కీర్తి పెరిగింది.

1965 నుంచి సహజ స్మారక చిహ్నంగా రక్షించబడింది, బాంగే-రి జింగో ప్రస్తుతం 33 మీటర్ల ఎత్తు, 37.5 మీటర్ల వెడల్పుతో ఒక మహా వృక్షం లాగా కనిపిస్తుంది.ఇది శరదృతువులో పూర్తిగా బంగారు వర్ణంలోకి మారిపోతుంది.చెట్టు ఇలా గోల్డెన్ కలర్ లో మెరిసిపోతూ ఉంటే భవిష్యత్తులో సంపన్నమైన పంట అందినట్లేనని చాలామంది నమ్ముతూ చెట్టును ఎంతో ఆదరిస్తారు.
గ్రామ అధిపతి ఛాయ్ బీమ్-సిక్ మాట్లాడుతూ ఈ చెట్టు ప్రతిరోజూ వేలాది మంది సందర్శకులను ఆకర్షిస్తుందని పేర్కొన్నారు.మరొక ముఖ్యమైన జింగో చైనాలోని జోంగ్నాన్ పర్వతాలలో గు గ్వాన్యిన్ బౌద్ధ దేవాలయంలో ఉంది.
ఈ చెట్టు కూడా ఒక ముఖ్యమైన టూరిస్ట్ అట్రాక్షన్ గా మారింది.







