హీరో అయినా కమెడియన్ అనే పిలుస్తున్నారు.. సుధీర్ కామెంట్స్ వైరల్?

సుడిగాలి సుదీర్( Sudheer ) ప్రస్తుతం వెండితెర సినిమాలలో నటిస్తే కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉన్నారు.ఇటీవల గాలోడు ( Galodu ) సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చి ఎంతో అద్భుతమైనటువంటి విజయాన్ని సొంతం చేసుకోగా తర్వాత కాలింగ్ సహస్ర( Calling Sahastra ) ఆనే సినిమా ద్వారా డిసెంబర్ ఒకటవ తేదీ ప్రేక్షకుల ముందుకు వచ్చారు.

 Sudigali Sudheer Comments About Jabardasth Comedian Tag, Sudigali Sudheer, Ga-TeluguStop.com

అయితే ఈ సినిమా పూర్తిగా నిర్మాతలకు నష్టాలను మిగిల్చిందని చెప్పాలి.అసలు లాజిక్ లేనటువంటి సన్నివేశాలతో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చి తీవ్ర నిరాశకు గురిచేసింది.

Telugu Sahastra, Jabardasth, Tollywood-Movie

ఇక ఈ సినిమా పూర్తిగా నెగిటివ్ రివ్యూలతో డిజాస్టర్ టాక్ సొంతం చేసుకొని నిర్మాతలకు భారీ నష్టాలను తీసుకువచ్చింది.అయితే ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నటువంటి సుధీర్ ఈ సినిమా గురించి ఎన్నో విషయాలను తెలియజేశారు.నటనకు ప్రాధాన్యత ఉన్న సినిమాలలో నేను నటిస్తే ప్రేక్షకులు ఎలా ఆదరిస్తారు అన్న ఉద్దేశంతోనే తాను ఈ సినిమా చేశానని సినిమా చూసిన వాళ్ళు నా నటనపై ప్రశంసలు కురిపించారని సుధీర్ తెలిపారు.ఈ సమావేశంలో భాగంగా ఈయనకు విలేకరి నుంచి ఆసక్తికరమైన ప్రశ్న ఎదురయింది.

మీరు హీరో అయినప్పటికీ కొంతమంది మిమ్మల్ని జబర్దస్త్ కమెడియన్ ( Jabardasth Comedian ) అనే పిలుస్తున్నారు.మీపై ఆ ట్యాగ్ ఇంకా తొలగిపోలేదు దీనికి మీరు ఏమైనా ఫీల్ అవుతున్నారు అంటూ ప్రశ్నించారు.

Telugu Sahastra, Jabardasth, Tollywood-Movie

ఈ ప్రశ్నకు సుదీర్ సమాధానం చెబుతూ నేను హీరో అయిన జబర్దస్త్ కమెడియన్ అంటూ ఉంటే నేను ఏమాత్రం ఫీల్ అవ్వలేదని ఎందుకంటే నాకు ఈ లైఫ్ ఇచ్చినదే జబర్దస్త్ కార్యక్రమం అని నేను అక్కడి నుంచే నా కెరియర్ మొదలు పెట్టాను కనుక ఆ విషయంలో తాను ఏమాత్రం ఫీల్ అవ్వడం లేదు అంటూ ఈ విషయంపై సుధీర్ చేసినటువంటి కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.ఇక కాలింగ్ సహస్ర సినిమా అభిమానులను పూర్తిగా నిరాశపరచడంతో సుధీర్ తదుపరి ఎలాంటి సినిమాల ద్వారా ప్రేక్షకులు ముందుకు రాబోతున్నారు తెలియాల్సి ఉంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube