ఇటీవలే కాలంలో వివాహేతర సంబంధాలన్నీ ( Extra Marital Affairs )చివరికి దారుణ హత్యలతో ముగుస్తున్నాయి.ఓ వివాహిత వరుసకు మరిది అయ్యే వ్యక్తితో అక్రమ సంబంధం కొనసాగిస్తున్న విషయం భర్తకు తెలియడంతో.
భార్యను కత్తితో పొడిచి హతమార్చాడు.ఆ తర్వాత రహస్యంగా అంత్యక్రియల నిర్వహణకు ఏర్పాట్లు చేసి చివరికి జైలు పాలు అయిన ఘటన జడ్చర్ల( Jadcherla )లో చోటుచేసుకుంది.
అందుకు సంబంధించిన వివరాలు ఏమిటో చూద్దాం.పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.
భూత్పూర్ మండలం బట్టుపల్లికి చెందిన శేఖర్ గౌడ్ కు మొల్గర గ్రామానికి చెందిన అనూషకు కొన్నేళ్ల క్రితం వివాహమైంది.ఈ దంపతులకు ఇద్దరు కుమారులు సంతానం.
వీరి కుటుంబం జడ్చర్ల మున్సిపాలిటీ పరిధిలో ఉండే పద్మావతి కాలనీలో ఓ అద్దె ఇంట్లో నివాసం ఉంటున్నారు.శేఖర్ గౌడ్ జడ్చర్లలో కార్ మెకానిక్ గా పని చేస్తున్నాడు.
అనూష కాలనీ సమీపంలో లేడీస్ టైలర్ నిర్వహిస్తోంది.

అయితే శేఖర్ కు వరుసకు సోదరుడు అయ్యే ప్రదీప్ గౌడ్ భూత్పూర్ లో జిమ్ ట్రైనర్ గా పనిచేస్తున్నాడు. శేఖర్ భార్య అనూషకు, ప్రదీప్ గౌడ్ కు మధ్య వివాహేతర సంబంధం ఏర్పడింది.అనూష టైలర్ షాప్ పక్కన ఉండే ఇంట్లో ఓ మహిళ తన కూతురితో ఒంటరిగా జీవిస్తోంది.
అనూష తరచూ ఆ మహిళ ఇంట్లో ఉండే వాష్ రూమ్ ను ఉపయోగించుకుంటుంది.అయితే బుధవారం మహిళ ఒక పని నిమిత్తం ఎమ్మార్వో ఆఫీస్ కు వెళ్లగా.
అనూష ఫోన్ చేసి ప్రియుడు ప్రదీప్ ను అక్కడికి పిలుచుకుంది.మహిళ కూతురిని షాప్ లో కూర్చోబెట్టి, అనుష ప్రియుడుతోపాటు ఆ మహిళ ఇంట్లోకి వెళ్ళింది.

కాసేపటికి శేఖర్ అక్కడికి వచ్చి తన భార్య ఎక్కడికి వెళ్లిందని ఆ బాలికను అడిగితే.తమ ఇంట్లో ఉన్న వాష్ రూమ్ కు వెళ్లిందని చెప్పింది.శేఖర్ అక్కడికి వెళ్లి చూస్తే.అనూష తన ప్రియుడుతో సన్నిహితంగా ఉండడం కనిపించింది.శేఖర్( Shekhar ) క్షణికావేశంలో పక్కనే ఉన్న కత్తితో భార్య అనూష పై, ప్రదీప్ పై దాడి చేశాడు.ఇంతలో ఆ ఇంటి యజమానురాలు వచ్చి శేఖర్ ను నిలదీసి వెంటనే ఆసుపత్రికి తీసుకువెళ్ళు అని చెప్పడంతో భార్య, ప్రదీప్ ను మహబూబ్ నగర్ ఆసుపత్రికి తీసుకెళ్లాడు కానీ అప్పటికే అనూష మృతి చెందింది.
ప్రదీప్ ను ఆసుపత్రిలో చేర్పించి.అనూష మృతదేహాన్ని మొల్గర గ్రామానికి తీసుకువెళ్లి కుటుంబ సభ్యులకు జరిగిన విషయం చెబితే వారంతా అంత్యక్రియలకు ఏర్పాటు చేశారు.
అయితే గ్రామస్తులు పోలీసులకు సమాచారం అందించడంతో గ్రామానికి చేరుకున్న పోలీసులు శేఖర్ ను అదుపులోకి తీసుకొని, అనూష మృతదేహాన్ని పోస్ట్మార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.







