దసరా వంటి మాస్ యాక్షన్ బ్లాక్ బస్టర్ తర్వాత నాని ( Nani ) లవ్ స్టోరీతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.నాని ప్రస్తుతం నటించిన ‘‘హాయ్ నాన్న”( Hi Nana ) సినిమా ఈ రోజు అనగా డిసెంబర్ 7న ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
నాని అండ్ టీమ్ ముందు నుండి డిఫరెంట్ గా ప్రమోషన్స్ చేస్తూ ప్రేక్షకుల్లో మంచి అంచనాలు పెరిగేలా చేశారు.

ఈ క్రమంలోనే ఎన్నో అంచనాల మధ్య ఈ రోజు ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాగ ఇప్పటికే పడిన ప్రీమియర్స్ తో ఈ సినిమాకు పాజిటివ్ బజ్ వచ్చింది.మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమాతో నాని మరో హిట్ ను తన ఖాతాలో వేసుకునేలా కనిపిస్తుంది.కాగా ఈ సినిమాను కొత్త డైరెక్టర్ శౌర్యన్ తెరకెక్కించగా ఇందులో బేబీ కియారా ఖన్నా( Baby Kiara Khanna ) నాని కూతురు రోల్ పోషించింది…

అలాగే నానికి జోడీగా మృణాల్ ఠాకూర్ ( Mrunal Thakur ) హీరోయిన్ గా నటించగా వీరి మధ్య కెమిస్ట్రీ కూడా ఆడియెన్స్ ను ఆకట్టుకుంది అని టాక్.ఇక వైరా ఎంటెర్టైనమెంట్స్ బ్యానర్ పై మోహన్ చెరుకూరి ఈ సినిమాను భారీ బడ్జెట్ తో నిర్మించారు.హేషమ్ అబ్దుల్ సంగీతం అందించిన ఈ సినిమా ఈ రోజు రిలీజ్ కాగా ఇప్పుడు ఈ సినిమా నుండి మరో అప్డేట్ బయటకు వచ్చింది.
తాజాగా టాలీవుడ్ వర్గాల నుండి అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమా డిజిటల్ హక్కుల గురించి అప్డేట్ బయటకు వచ్చింది.హాయ్ నాన్న ఓటిటి హక్కులను ప్రముఖ ఓటిటి సంస్థ నెట్ ఫ్లిక్స్ (Netflix) భారీ ధర చెల్లించి సొంతం చేసుకున్నట్టు టాక్.
దీంతో ఈ సినిమా థియేటర్స్ లో రన్ ముగించిన తర్వాత నెట్ ఫ్లిక్స్ లోనే స్ట్రీమింగ్ కాబోతుంది.చూడాలి మరి ఈ సినిమా ఫస్ట్ డే ఓపెనింగ్స్ ఎంత కొల్లగొడుతుందో.







