తెలుగు సినీ ప్రేక్షకులకు దర్శకుడువక్కంతం వంశీ( Vakkantham Vamsi ) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.టాలీవుడ్ పాన్ ఇండియా హీరో అల్లు అర్జున్ హీరోగా నటించిన నా పేరు సూర్య సినిమాతో తెలుగు సినిమా ఇండస్ట్రీకి డైరెక్టర్ గా ఎంట్రీ ఇచ్చారు వక్కంతం వంశీ.
మొదటి సినిమాతోనే మంచి విజయాన్ని అందుకున్నారు.ఇక ప్రస్తుతం హీరో నితిన్ తో కలిసి ఎక్స్ట్రా ఆర్డినరీ మ్యాన్ అనే సినిమాను తెరకెక్కించారు వంశీ.
ఈ సినిమాలో నితిన్ సరసన శ్రీ లీలా హీరోయిన్ గా నటించిన విషయం తెలిసిందే.ఈ సినిమా రేపు అనగా డిసెంబర్ 8న ప్రేక్షకుల ముందుకు రానుంది.

శ్రేష్ట్ మూవీస్ సంస్థ నిర్మించిన ఈ మూవీకి హారిస్ జయరాజ్ సంగీతం అందించారు.అయితే విడుదల తేదీకి మరి కొన్ని గంటల సమయం మాత్రమే ఉండడంతో చిత్ర బృందం ప్రమోషన్స్ ని మరింత వేగవంతం చేసింది.ఈ ప్రమోషన్స్ లో భాగంగానే ప్రస్తుతం డైరెక్టర్ వంశీ అలాగే హీరో హీరోయిన్లు వరుసగా ఇంటర్వ్యూలకు హాజరవుతూ ఫుల్ బిజీ బిజీగా గడుపుతున్నారు.ఇందులో బాగానే తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న వక్కంతం వంశీ ఇంటర్వ్యూలో భాగంగా మాట్లాడుతూ.
మా టీమ్ మొత్తం ఎక్స్ట్రా ఆర్డినరీ మ్యాన్ కోసం ఎంతో కష్టపడ్డారు.తప్పకుండా మూవీ అందరి అంచనాలు అందుకుంటుంది అని అని తెలిపారు వంశీ.అలాగే త్వరలో పవన్ కళ్యాణ్ తో సురేందర్ రెడ్డి తెరకెక్కించనున్న మూవీ సోషల్ సెటైరికల్ కాన్సెప్ట్ గా తెరకెక్కనుందని తెలిపారు.

అన్ని వర్గాల ఆడియన్స్ ని అలానే పవన్ ఫ్యాన్స్ ని అలరించేలా స్క్రిప్ట్ సిద్ధం అవుతోందని, తప్పకుండా అది కథకుడిగా తనకు మరింత మంచి పేరు తెచ్చుపెడుతుందనే నమ్మకం ఉందని చెప్పుకొచ్చారు వంశీ.ఈ సందర్భంగా ఇంటర్వ్యూలో భాగంగా వంశీ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.ఇకపోతే ఎక్స్ట్రా ఆర్డినరీ మ్యాన్ సినిమా విషయానికి వస్తే.
ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన టీజర్ పోస్టర్లకు ప్రేక్షకుల నుంచి భారీగా స్పందన లభించింది.ఈ సినిమా ఎప్పుడెప్పుడు విడుదల అవుతుందా అని అభిమానులు ఎంతో ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు.







