టాలీవుడ్ ఇండస్ట్రీలోకి కమల్ హాసన్( Kamal Hassan ) వారసురాలుగా అడుగుపెట్టారు నటి శృతిహాసన్.ఈమె కెరియర్ మొదట్లో ఫ్లాప్ సినిమాలను ఎదుర్కొంటూ ఐరన్ లెగ్ అనే ట్రోల్స్ కూడా ఎదుర్కొన్నారు.
ఇలా కెరియర్ మొదట్లో ఎన్నో విమర్శలను ఎదుర్కొంటున్నటువంటి శృతిహాసన్ అనంతరం గబ్బర్ సింగ్ సినిమా ద్వారా బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నారు.ఇక ఈ సినిమా మంచి సక్సెస్ కావడంతో ఈమె పట్ల ఎంతోమంది ప్రశంశలు కురిపించడమే కాకుండా తనకు అభిమానిగా మారిపోయారు.
ఇలా వరుస సినిమాలలో నటిస్తూ తెలుగు చిత్ర పరిశ్రమలో ఓ వెలుగు వెలిగినటువంటి శృతిహాసన్ తన వ్యక్తిగత కారణాల వల్ల కొంత కాలం పాటు సినిమా ఇండస్ట్రీకి దూరం అయ్యారు.
ఇలా సినిమా ఇండస్ట్రీకి దూరమైనటువంటి ఈమె తిరిగి రవితేజ హీరోగా నటించిన క్రాక్ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు.
ఈ సినిమా బ్లాక్ బస్టర్ కావడంతో ఇప్పుడు ఏకంగా పాన్ ఇండియా సినిమాలలో నటిస్తూ బిజీగా ఉన్నారు.ఇకపోతే తాజాగా శృతిహాసన్ గురించి ఒక వార్త వైరల్ గా మారింది.
శృతిహాసన్ వరుసగా మూడు నాలుగు సినిమాలు ఫ్లాప్ అయినటువంటి హీరోల పక్కన హీరోయిన్గా నటించగా ఆ సినిమాలు సక్సెస్ అవుతున్నాయి అంటూ ఒక వార్త వైరల్ గా మారంది.ప్లాప్ సినిమాలను ఎదుర్కొన్నటువంటి రవితేజ పవన్ కళ్యాణ్ మహేష్ బాబు వంటి హీరోలందరూ కూడా శృతిహాసన్ తో నటించి సక్సెస్ అందుకున్నారు.
పవన్ కళ్యాణ్ ( Pawan Kalyan ) గబ్బర్ సింగ్ ( Gabber Sing ) సినిమాకు ముందు వరుసగా ఫ్లాప్ సినిమాలను ఎదుర్కొన్నారు.అయితే గబ్బర్ సింగ్ సినిమాలో శృతిహాసన్ తో కలిసి నటించగా ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది.
ఇక మహేష్ బాబు( Mahesh Babu ) కూడా నంబర్ వన్ నేనొక్కడినే, ఆగడు వంటి వరుస ఫ్లాప్ సినిమాలను ఎదుర్కొన్న తర్వాత కొరటాల శివ దర్శకత్వంలో వచ్చిన శ్రీమంతుడు ( Sreemanthudu ) సినిమాలో శృతిహాసన్ తో కలిసి నటించారు ఈ సినిమా కూడా బ్లాక్ బస్టర్ హిట్ అయింది.

రవితేజ( Ravi Teja) కూడా టచ్ చేసి చూడు నేల టికెట్ డిస్కో రాజా అమర్ అక్బర్ ఆంటోనీ వంటి వరుస ఫ్లాప్ సినిమాలను ఎదుర్కొన్నారు ఈ సినిమా తర్వాత క్రాక్ ( Crack ) సినిమాలో నటించారు.ఈ సినిమాలో శృతిహాసన్ హీరోయిన్గా నటించింది.ఈ సినిమా కూడా బ్లాక్ బస్టర్ హిట్ కావటం విశేషం.
ఇక అల్లు అర్జున్ ( Allu Arjun ) కూడా ఇదే కేటగిరీలోకి వస్తారు.ఈయన కూడా అప్పటివరకు వరుస ప్లాప్ సినిమాలలో నటిస్తున్నటువంటి అల్లు అర్జున్ శృతిహాసన్ తో కలిసి రేసుగుర్రం ( Resugurram ) సినిమాలో నటించారు.
ఈ సినిమా బ్లాక్ పోస్టర్ హిట్ అయింది.ఇక నాగచైతన్య ( Nagachaitanya ) వరుస ఫ్లాప్స్ సినిమాల తర్వాత శృతిహాసన్ తో కలిసి ప్రేమమ్ ( Premam ) సినిమాలో నటించారు.
ఈ సినిమా కూడా ఎంతో విజయవంతమైంది.

ఇక ప్రస్తుతం ఈమె ప్రభాస్ సరసన నటిస్తున్నారు.ప్రభాస్ ( Prabhas ) బాహుబలి సినిమా తర్వాత సాహో, రాధే శ్యామ్ ఆది పురుష్ వంటి సినిమాలలో నటించారు.ఈ సినిమాలు పెద్దగా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయాయి.
డిసెంబర్ 22వ తేదీ ప్రభాస్ సలార్ ( Salaar )సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నారు.వరుస 3 ఫ్లాప్ సినిమాల తర్వాత ప్రభాస్ శృతిహాసన్ తో కలిసి సలార్ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడంతో ఈ సినిమా కూడా బ్లాక్ బాస్టర్ హిట్ అవుతుంది అంటూ అభిమానులు భావిస్తున్నారు.
మరి శృతిహాసన్ లక్ ప్రభాస్ కి ఏ విధంగా కలిసి వస్తుందో తెలియాల్సి ఉంది.







