అక్కినేని నాగార్జున ( Nagarjuna Akkineni ) ఆరు పదుల వయసులో కూడా కుర్ర హీరోలకు పోటీగా సినిమాలు చేస్తున్న విషయం తెలిసిందే.గతంలో వరుస హిట్స్ తో దూసుకు పోయిన నాగ్ కు గత కొద్దీ రోజులుగా హిట్స్ అనేవి దక్కడం లేదు.
దీంతో వరుస ప్లాప్స్ తర్వాత కొద్దిగా గ్యాప్ ఇచ్చి ఆచి తూచి ఎంచుకున్న మూవీ ”నా సామిరంగ’‘ ( Naa Saami Ranga).అనౌన్స్ మెంట్ రోజునే టైటిల్ తో పాటు ఫస్ట్ గ్లింప్స్ కూడా రిలీజ్ చేయగా ఈ టీజర్ ఫ్యాన్స్ ను చాలా ఆకట్టుకుంది.
ఫస్ట్ ఇంప్రెషన్ నే బెస్ట్ అనిపించుకుని చాలా రోజుల తర్వాత ఈయన సినిమాపై మంచి అంచనాలు పెరిగేలా చేసాడు.ప్రకటించగానే వెంటనే రెగ్యురల్ షూట్ కూడా స్టార్ట్ చేసి ఫినిష్ చేసే పనిలో పడ్డారు.
అంతేకాదు సంక్రాంతి రేసులో రాబోతున్నామంటూ ప్రకటించి అందరికి పెద్ద సర్ప్రైజ్ ఇచ్చారు.

నాగ్ ఈ సినిమా కోసం మాస్ మేకోవర్ లోకి మారి పోగా ఈ మేకోవర్ ఫ్యాన్స్ ను బాగా అలరించింది.ఇదిలా ఉండగా సంక్రాంతి పోటీ భారీగా ఉండగా నాగ్ వస్తాడో లేదంటే వాయిదా వేసుకుంటాడో అని అంత అనుకున్నారు.కానీ మరోసారి తాజాగా కొన్ని ఫోటోలను షేర్ చేసి మేకర్స్ కన్ఫర్మ్ చేసారు.
తాజాగా డైరెక్టర్ విజయ్ బిన్నీ బర్త్ డే విషెష్ చెబుతూ కొన్ని పిక్స్ షేర్ చేసారు.

ఈ పిక్స్ లో కూడా సంక్రాంతి వస్తున్నాం అంటూ కన్ఫర్మ్ చేసారు.దీంతో నాగ్ ఎంత పోటీ ఉన్నప్పటికీ తగ్గేదే లేదు అంటున్నాడు.చూడాలి మరి ఈ పోటీలో నాగార్జున నా సామిరంగ ఎలాంటి విజయం అందుకుంటుందో.
కాగా శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ బ్యానర్ పై తెరకెక్కుతున్న ఈ సినిమాకు ఎం ఎం కీరవాణి సంగీతం అందిస్తున్నాడు.అలాగే ఆషికా రంగనాథ్ ( Ashika Ranganath ) హీరోయిన్ గా ఎంపిక అయినట్టు సమాచారం.







