న్యాచురల్ స్టార్ నాని ( Nani )సినిమా సినిమాకు వైవిధ్యం ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు.నాని కెరీర్ లోని బ్లాక్ బస్టర్ సినిమాలలో జెర్సీ సినిమా( Jersey movie ) ఒకటి కాగా ఈ సినిమా ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది.
నాని గౌతమ్ తిన్ననూరి( Gautam Tinnanuri ) కాంబినేషన్ లో జెర్సీ సినిమా తెరకెక్కగా సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై ఈ సినిమా తెరకెక్కడం గమనార్హం.అయితే ఈ సినిమా కథను గౌతమ్ తిన్ననూరి వెంకటేశ్ ను దృష్టిలో ఉంచుకుని రాశారట.
అయితే వెంకటేశ్( Venkatesh ) తనకు ఈ సినిమా సెట్ కాదని సున్నితంగా వదులుకున్నారట.వెంకటేశ్ ఈ విషయాన్ని స్వయంగా చెప్పారని నాని అన్నారు.వెంకటేశ్ క్రికెట్ ప్లేయర్ కావడంతో గౌతమ్ తిన్ననూరి ఆ విధంగా ఆలోచించారట.వెంకటేశ్ ఈ సినిమాను మిస్ చేసుకుని తప్పు చేశారని కొంతమంది సోషల్ మీడియా వేదికగా కామెంట్లు చేస్తున్నారు.
వెంకటేశ్ రేంజ్ అంతకంతకూ పెరుగుతుండటం గమనార్హం.

నాని హాయ్ నాన్న సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానుండగా వెంకటేశ్ సైంధవ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు.హాయ్ నాన్న మూవీ ఈ నెల 7వ తేదీన పాన్ ఇండియా మూవీగా రిలీజ్ కానుండగా శృతి హాసన్ ఈ సినిమాలో స్పెషల్ సాంగ్ లో కనిపించనున్నారని సమాచారం అందుతోంది.శృతి హాసన్ ఈ సినిమాలో నాని కూతురికి తల్లి పాత్రలో కనిపిస్తారో లేదో తెలియాల్సి ఉంది.

హాయ్ నాన్న సినిమాపై దర్శకుడు శౌర్యువ్( director Souryuv ) చాలా ఆశలు పెట్టుకున్నారు.ఫీల్ గుడ్ ఎమోషనల్ మూవీగా తెరకెక్కిన ఈ సినిమా కమర్షియల్ రిజల్ట్ ఎలా ఉండబోతుందో చూడాల్సి ఉంది.కొన్ని ఏరియాలలో నాని సొంతంగా ఈ సినిమాను రిలీజ్ చేయనున్నారని తెలుస్తోంది.నానిని అభిమానించే ఫ్యాన్స్ సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది.నాని రెమ్యునరేషన్ ప్రస్తుతం 25 కోట్ల రూపాయల రేంజ్ లో ఉంది.







