తెలంగాణ రాజకీయాల్లో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది.ఢిల్లీలోని కేసీ వేణుగోపాల్ నివాసానికి తెలంగాణ రాష్ట్ర నేత భట్టి విక్కమార్క వెళ్లారు.
ఈ మేరకు కేసీ వేణుగోపాల్, డీకే శివకుమార్ మరియు మాణిక్ రావు ఠాక్రేతో భట్టి సమావేశం అయ్యారు.ఈ భేటీలో ప్రధానంగా తెలంగాణలో ప్రభుత్వ ఏర్పాటు, సీఎం అభ్యర్థి ఎంపికపై ప్రధానంగా చర్చిస్తున్నారని తెలుస్తోంది.
అయితే దాదాపు 30 ఏళ్లుగా పార్టీలో సేవలు అందిస్తున్న తాము కూడా ముఖ్యమంత్రి పదవి రేసులో ఉన్నట్లు భట్టి కోరుతున్నారని తెలుస్తోంది.ఈ నేపథ్యంలోనే ఆయన ఢిల్లీకి వెళ్లారని సమాచారం.
కానీ గెలిచిన కాంగ్రెస్ అభ్యర్థుల మద్ధతు ఎక్కువగా రేవంత్ రెడ్డికి ఉండటంతో పార్టీ అగ్రనేతలతో భట్టి చర్చలు జరుపుతున్నారని తెలుస్తోంది.ఈ క్రమంలో సీఎం పీఠాన్ని ఆశిస్తున్న సీనియర్ నేతలను పార్టీ హైకమాండ్ ఎలా బుజ్జగిస్తుందనే అంశంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.







