భారతదేశంలో రోజురోజుకీ ఎలక్ట్రిక్ వాహనాల హవా పెరుగుతోంది.ఒకవైపు అధిక పెట్రోల్ ధరలు.
మరొకవైపు పర్యావరణ కాలుష్యం కారణంగా భారత మార్కెట్లో ఎలక్ట్రిక్ వాహనాల విక్రయాలు అధికంగా ఉండడంతో ఎలక్ట్రిక్ వాహనాలు తయారు చేసే ప్రముఖ కంపెనీలు ఎప్పటికప్పుడు మార్కెట్లో తమ కంపెనీ వాహనాలను విడుదల చేస్తూ కొనుగోలుదారులను ఆకర్షించే పనిలో ఉన్నారు.భారత మార్కెట్లో త్వరలో విడుదల అవ్వనున్న ఎలక్ట్రిక్ స్కూటర్ల వివరాలు ఏమిటో చూద్దాం.
సింపుల్ డాట్ వన్:( Simple dot one ) తమిళనాడుకు చెందిన స్టార్టర్ కంపెనీ సింపుల్ ఎనర్జీ మార్కెట్లోకి సింపుల్ డాట్ వన్ ఎలక్ట్రిక్ స్కూటర్ ను విడుదల చేసి, మంచి ప్రజాదరణ పొందింది.కంపెనీ మొదటి స్కూటర్లో దాదాపు 500 యూనిట్లను డెలివరీ చేసింది.
ఇప్పుడు దాని రెండో ఉత్పత్తి సింపుల్ డాట్ వన్ ను డిసెంబర్ 15న విడుదల చేయనుంది.ఈ స్కూటర్ ఐడీసీ పరిధి 212 కి.మీ గా ఉంటుంది.మంచి డిస్కౌంట్ ఆఫర్లతో మార్కెట్లోకి విడుదల అవ్వనుంది.
ఏథర్:( Aether ) బెంగళూరుకు చెందిన ఏథర్ కంపెనీ ( Aether Company )ఏథర్ 450లో కొత్త మోడల్ ప్రవేశపెట్టనుంది.TVS ఐక్యూబ్ కు పోటీ గా ఎలక్ట్రిక్ స్కూటర్ మార్కెట్లో అడుగుపెట్టనుంది.
ఏథర్ ఎనర్జీ సహ వ్యవస్థాపకుడు తరుణ్ మెహతా ఒక ట్విట్ చేశారు.ట్విట్ ప్రకారం 2024 ఆరంభంలో ఈ స్కూటర్ మార్కెట్లోకి అడుగుపెట్టే అవకాశం ఉంది.

సుజుకి బర్గ్ మ్యాన్:( Suzuki Burgman ) ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ హోండా యాక్టివా కు పోటీగా మార్కెట్లోకి విడుదల అవ్వనుంది.2024 లో ఈ స్కూటర్ ను భారత మార్కెట్లో విడుదల చేసేందుకు కంపెనీ అన్ని కార్యక్రమాలను పూర్తి చేస్తోంది.ఇప్పటికే ఈ స్కూటర్ ను భారతదేశంలో పరీక్షిస్తోంది.ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ ఎక్స్ షోరూం ధర రూ.1లక్ష ఉండే అవకాశం ఉంది.

హోండా యాక్టివా: ( Honda Activa )TVS, Hero ఎలక్ట్రిక్ స్కూటర్లకు పోటీగా పూర్తి ఎలక్ట్రిక్ యాక్టివా లాంచ్ తో మార్కెట్లో సంచలనం సృష్టించాలని హోండా యాక్టివా భావిస్తోంది.ఈ స్కూటర్ ధర కాస్త ఎక్కువగానే ఉండే అవకాశం ఉంది.మైమరిపించే ఫీచర్లతో 2024 ప్రారంభంలో భారత మార్కెట్లోకి అడుగుపెట్టే అవకాశం ఉంది.







