రూ.15 వేల బడ్జెట్ లో బెస్ట్ ఫీచర్లతో ఉండే స్మార్ట్ ఫోన్లు ఇవే..!

ప్రముఖ స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థలు మధ్యతరగతి కొనుగోలుదారులను దృష్టిలో పెట్టుకుని అద్భుతమైన ఫీచర్లు ఉండే స్మార్ట్ ఫోన్లను( Smart Phones ) తక్కువ బడ్జెట్లో మార్కెట్లోకి విడుదల చేస్తున్నాయి. రూ.15 బడ్జెట్ లో ఎన్నో రకాల ఫోన్లు అందుబాటులో ఉన్నాయి.అందులో సూపర్ ఫీచర్లతో ఉండే స్మార్ట్ ఫోన్లు ఏవో చూద్దాం.

 Smart Phone Under 15k With Best Features Details, Buy Smart Phone ,under 15k Mob-TeluguStop.com

లావా బ్లేజ్ ప్రో 5G:

ఈ స్మార్ట్ ఫోన్( Lava Blaze Pro 5G ) 6.78 అంగుళాల 120Hz LCD డిస్ ప్లే తో ఉంటుంది.8GB RAM+128GB స్టోరేజ్ తో వస్తుంది.LED ఫ్లాష్ తో 50MP AI కెమెరా, 8MP సెల్పీ కెమెరా తో ఉంటుంది.

ఈ స్మార్ట్ ఫోన్ లో ఉండే కెమెరాలు EIS సపోర్ట్ తో 2K వీడియో రికార్డింగ్ కు సపోర్ట్ చేస్తాయి.పవర్ఫుల్ మీడియాటెక్ డైమెన్సిటీ 6020 ప్రాసెసర్ తో పనిచేస్తుంది.33w చార్జింగ్ సపోర్ట్ తో 5000mAh బ్యాటరీ సామర్థ్యంతో ఉంటుంది.ఈ ఫోన్ ధర రూ.12999గా ఉంది.

శాంసంగ్ గెలాక్సీ M14 5G:

ఈ ఫోన్( Samsung Galaxy M14 5G ) 6.6 అంగుళాల 90Hz IPS LED స్క్రీన్ తో వస్తుంది.4GB RAM+ 128GB స్టోరేజ్ తో ఉంటుంది.50MP+2MP+2MP ట్రిపుల్ కెమెరా సెటప్, 13MP ఫ్రంట్ కెమెరాతో వస్తుంది.ఈ ఫోన్ ఎక్సి నోస్ 1330 చిప్ సెట్ తో వస్తుంది.6000mAh బ్యాటరీ సామర్థ్యంతో ఉంటుంది.ఈ ఫోన్ ధర రూ.10499గా ఉంది.

రెడ్ మీ 12G:

ఈ ఫోన్ 6.78 అంగుళాల FHD+ 90Hz అడాప్టివ్ సింక్ డిస్ ప్లే తో ఉంటుంది.50MP డ్యూయల్ కెమెరా సెటప్, 8MP సెల్ఫీ కెమెరా, ఆండ్రాయిడ్ 13 బెస్ట్ MIUI 14 ఆపరేటింగ్ సిస్టమ్ తో ఉంటుంది.5000mAh బ్యాటరీ సామర్థ్యంతో ఉంటుంది.8GB RAM+256GB స్టోరేజ్ వేరియంట్ స్మార్ట్ ఫోన్ ధర రూ.15499 గా ఉంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube