సింగపూర్‌లోని( Singapore ) నవ వధూవరులు కేఎఫ్‌సీ( KFC ) పట్ల తమ ప్రేమను వ్యక్తపరచడానికి చాలా క్రియేటివ్‌గా ఆలోచించారు.వారు తమ వెడ్డింగ్‌ను( Wedding ) కేఎఫ్‌సీ ఫాస్ట్ ఫుడ్ చైన్ థీమ్‌తో ప్లాన్ చేశారు.
ఈ జంట పేర్లు లాయింగ్ లే వాంగ్, (32) గ్జియి పెంగ్ (40).ఈ క్యూట్ కపుల్ నవంబర్ 26న ఫ్రైడ్ చికెన్, జింగర్ శాండ్‌విచ్‌లు, కల్నల్ సాండర్స్, మసాలా దినుసులతో కూడిన వేడుకతో పెళ్లి చేసుకున్నారు.
వీల్ చైర్‌కే పరిమితమైన వధువు వాంగ్ కేఎఫ్‌సీ థీమ్‌తో పెళ్లి చేసుకోవాలనేది తన కల అని ఫేస్ బుక్‌లో పేర్కొంది.ఆమె, ఆమె భర్త కలిసి చివరికి బొకేలో కూడా ఫ్రైడ్ చికెన్స్( Fried Chicken ) పడేశారు.
చికెన్ డ్రమ్ స్టిక్స్‌తో చేసిన బొకే పట్టుకుని, ఒక పెద్ద జింగర్ శాండ్‌విచ్ పక్కన పోజులిచ్చిన ఫొటోలు కూడా సోషల్ మీడియాలో పంచుకుంది.తన ప్రత్యేక రోజును “ఫింగర్ లిక్కిన్”( Finger Lickin ) అంత మంచిగా చేసినందుకు కేఎఫ్‌సీకి ఆమె ధన్యవాదాలు తెలిపింది.
నివేదికల ప్రకారం, కేఎఫ్‌సీ వెడ్డింగ్ మీల్స్‌లో సగం వరకు స్పాన్సర్ చేసింది.రిసెప్షన్ కోసం డెకరేషన్ కూడా అందించింది.ఈ జంట వారి వివాహానికి శుభాకాంక్షలు తెలిపిన కేఎఫ్‌సీ మస్కట్ నుంచి పర్సనలైజ్డ్ మెసేజ్‌ను కూడా అందుకుంది.కేఎఫ్‌సీ కోసం ఈ జంట చూపించిన ప్రేమ చాలామందిని ఫిదా చేస్తోంది.
ఈ సంస్థ పై వారి ప్రేమ ఒక ఔట్‌లెట్‌లో వారి ఫస్ట్ డేట్ ప్లాన్ చేసినప్పుడు ప్రారంభమైంది.
అప్పటి నుండి, వాంగ్ ( Wong ) ఆ బ్రాండ్‌కి వీర అభిమాని అయ్యింది.దానిని తన పెళ్లిలో చేర్చుకోవాలనుకుంది.ఆన్‌లైన్‌లో వాంగ్‌ను కలిసిన పెంగ్, ఆమె ఆలోచనకు మద్దతునిచ్చి ప్రత్యేకమైన ఈవెంట్‌ను ప్లాన్ చేయడంలో ఆమెకు సహాయపడ్డాడు.
ఈ వెడ్డింగ్ మీడియా, ప్రజల దృష్టిని ఆకర్షించింది, నెటిజన్లు ఈ కపుల్స్ క్రియేటివిటీని ప్రశంసించారు.మరికొందరు ఇలాంటి పెళ్లి చేసుకోవాలనే ఆసక్తిని కూడా వ్యక్తం చేయగా, ఇంకొందరు చికెన్‌ను ఎక్కువగా వేయించి తినడం వల్ల కలిగే ఆరోగ్య ప్రమాదాల గురించి చమత్కరించారు.