తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలలో( Telangana assembly election ) బీఆర్ఎస్ ఘోర ఓటమి పాలు కావటం తెలిసిందే.ఆ పార్టీ అధ్యక్షుడు కేసీఆర్( KCR ) సైతం కామారెడ్డిలో ఓడిపోవడం జరిగింది.
గజ్వేల్ లో గెలవడం జరిగింది.అయినా గాని 39 స్థానాలలో గెలిచి.
బీఆర్ఎస్ ఓటమి చెందింది.ప్రతిపక్ష పార్టీగా నిలిచింది.
కాంగ్రెస్ పార్టీ 64 స్థానాలు గెలిచి అధికారంలోకి రావడం జరిగింది.దీంతో బీఆర్ఎస్ నేతలు ఎంతో నిరోత్సాహంలో ఉన్నారు.
ఇటువంటి పరిస్థితులలో మరో విషాదం చోటుచేసుకుంది.జనగామ జిల్లా బీఆర్ఎస్ జడ్పీ చైర్మన్ పాగాల సంపత్ రెడ్డి ( Chairman Pagala Sampath Reddy )గుండెపోటుతో మరణించారు.
గుండెపోటు వచ్చిన వెంటనే కుటుంబ సభ్యులు హనుమకొండలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రికి తరలించగా అప్పటికే మరణించినట్లు వైద్యులు తెలియజేశారు.దీంతో కుటుంబ సభ్యులు కన్నీరు మున్నిరయ్యారు.పాగాల సంపత్ రెడ్డి మరణంతో బీఆర్ఎస్ పార్టీకి చెందిన కార్యకర్తలు, నాయకులు సానుభూతి వ్యక్తం చేస్తున్నారు.హనుమకొండలోని చైతన్యపురిలో సంపత్ రెడ్డి ఇంట్లో ఉండగానే హార్ట్ ఎటాక్ వచ్చింది.
ఈ క్రమంలో వ్యక్తిగత సిబ్బంది కుటుంబ సభ్యులు హుటాహుటిన స్పందించి.ప్రవేట్ ఆసుపత్రికి తరలించి ఎమర్జెన్సీలో చికిత్స అందించిన.
ప్రాణాలు దక్కలేదు.సంపత్ రెడ్డి మరణవార్త బీఆర్ఎస్ పార్టీలో విషాదం నింపింది.