ప్రైజ్ మనీ 50 లక్షలు వారికే ఇస్తాను... పల్లవి ప్రశాంత్ కామెంట్స్ వైరల్!

బిగ్ బాస్( Bigg Boss ) సీజన్ సెవెన్ కార్యక్రమం 13 వారాలను పూర్తి చేసుకుంది.13వ వారంలో భాగంగా గౌతం కృష్ణ హౌస్ నుంచి బయటకు వచ్చిన సంగతి మనకు తెలిసిందే.ఇలా 13 వ వారం గౌతం ఎలిమినేట్ కావడంతో మిగిలిన ఏడుగురు కంటెస్టెంట్లు ఫైనల్స్ కు వెళ్తారని తెలుస్తుంది.ఇది సీజన్ 7 కావడంతో ఏడు మందిని ఫైనల్స్ కు తీసుకువెళ్తారు అంటూ వార్తలు వస్తున్నాయి .అందుకే ఈ వారం ఎలాంటి ఎలిమినేషన్స్ ఉండవని తెలుస్తోంది.ఇక ఈ వారంలో భాగంగా నాగార్జున కంటెస్టెంట్లతో మాట్లాడుతూ గెలిచిన వారికి ఇచ్చే ప్రైజ్ మనీ గురించి వివరించారు.

 Pallavi Prashanth Comments About Prize Money, Bigg Boss, Pallavi Prashanth, Priz-TeluguStop.com
Telugu Bigg Boss, Farmers, Nagarjuna, Prize-Movie

బిగ్ బాస్ విన్నర్ గా ఎవరైతే గెలుస్తారో వారికి ట్రోఫీతో పాటు 50 లక్షల రూపాయల ప్రైజ్ మనీ అలాగే జోయాలుకాస్ వారి 20 లక్షల రూపాయల బహుమతితో పాటు ఒక కారు కూడా ఇవ్వబడుతుంది అంటూ నాగార్జున( Nagarjuna ) తెలియజేశారు.అయితే హౌస్ లో ఉన్నటువంటి ఏడు మంది కంటెస్టెంట్లను నాగార్జున ప్రశ్నిస్తూ ప్రైజ్ మనీ గెల్చుకున్న తర్వాత ఆ డబ్బుతో ఏం చేస్తారని అడిగారు.ఇలా ఒక్కో కంటెస్టెంట్ ఒక్కో రీజన్ చెప్పారు.ఇక పల్లవి ప్రశాంత్ ( Pallavi Prashanth ) కూడా తన ప్రైజ్ మనీ గురించి మాట్లాడుతూ తాను కనుక బిగ్ బాస్ విజేతగా నిలిచి 50 లక్షలు అందుకుంటే తాను ఆ డబ్బును చనిపోయిన రైతు కుటుంబాలకు ఇస్తాను అంటూ ఈయన సమాధానం చెప్పారు.

Telugu Bigg Boss, Farmers, Nagarjuna, Prize-Movie

ఒక రైతుబిడ్డగా రైతు కష్టాలను తెలిసినటువంటి వ్యక్తిగా పల్లవి ప్రశాంత్ ఆ డబ్బును చనిపోయిన రైతుల కుటుంబానికి ఇస్తాను అని చెప్పడంతో అక్కడున్నటువంటి వారితో పాటు నాగార్జున కూడా ఫిదా అయ్యి ఒక్కసారిగా క్లాప్స్ కొట్టారు.ఈ మాటతో ఈయన ఎంతోమంది ఆడియన్స్ మనసును కూడా దోచుకున్నారని చెప్పాలి.ఇక ప్రస్తుతం పల్లవి ప్రశాంత్ తో పాటు అమర్ దీప్ కూడా టైటిల్ రేస్ లో ఉన్న సంగతి మనకు తెలిసిందే.వీరిద్దరి మధ్య టైటిల్ పోరు కొనసాగుతోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube