మెగా పవర్ స్టార్ రామ్ చరణ్( Ram Charan ) ఆర్ఆర్ఆర్ తర్వాత మరో భారీ పాన్ ఇండియన్ ప్రాజెక్టులు లైన్లో పెట్టుకున్న విషయం తెలిసిందే.ప్రస్తుతం రామ్ చరణ్ అగ్ర డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో ‘గేమ్ చేంజర్’( Game Changer ) సినిమా చేస్తున్నాడు.
ఈ సినిమాలో రామ్ చరణ్ సరసన కియారా అద్వానీ( Kiara Advani ) హీరోయిన్ గా నటిస్తుంది.పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాను దిల్ రాజు భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు.
ఇక రామ్ చరణ్ నెక్స్ట్ సినిమాపై అందరిలో ఆసక్తి నెలకొంది.చరణ్ గేమ్ చేంజర్ తర్వాత నెక్స్ట్ తన 16వ ప్రాజెక్ట్ ను యంగ్ డైరెక్టర్ బుచ్చిబాబు సానా ( Director Buchi Babu ) తో ప్రకటించిన విషయం తెలిసిందే.

ఈ ప్రాజెక్ట్ పై రామ్ చరణ్ కూడా గట్టి నమ్మకంతో ఉన్నారు.అందుకే ఈ యంగ్ డైరెక్టర్ కు రామ్ చరణ్ అవకాశం ఇచ్చారు.ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులతో బిజీగా ఉన్న మేకర్స్ ఇందులో సరైన నటీనటులను ఫిక్స్ చేసేందుకు కూడా కసరత్తులు చేస్తున్నారు.ఇక ఈ సినిమాలో ఇద్దరు హీరోయిన్లు ఉండనున్నారట.
మరి వారిలో ఒక హీరోయిన్ ను ఫిక్స్ చేసినట్టు టాక్.జాన్వీ కపూర్ ( Janhvi Kapoor) ను హీరోయిన్ గా తీసుకోబోతున్నారని ఈ అమ్మడి రోల్ సినిమాకే కీలకం అని తెలుస్తుంది.
మరి ఈ అమ్మడు ఆల్మోస్ట్ ఫిక్స్ అయినట్టే తెలుస్తుండగా మరో హీరోయిన్ గా ఎవరిని ఫిక్స్ చేస్తారో చూడాలి.కాగా ఈ సినిమాలో కీలక పాత్రలో విజయ్ సేతుపతి( Vijay Sethupathi ) నటిస్తున్నారట.
ఉ

ప్పెన సినిమాలో ఈయన నటనకు అంత ఎలా ఫిదా అయ్యారో అందరికి తెలుసు.మరి ఇప్పుడు బుచ్చిబాబు చరణ్ సినిమా కోసం కూడా విలన్ గా ఈయననే ఎంచుకున్నారట.అలాగే ఇందులో ఒక గెస్ట్ రోల్ కూడా ఉండగా ఆ రోల్ కోసం బాలీవుడ్ స్టార్ నటించ బోతున్నట్టు సమాచారం.కాగా రురల్ బ్యాక్ డ్రాప్ లో స్పోర్ట్స్ డ్రామాగా తెరకెక్కనున్న ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్ వారు నిర్మిస్తుండగా ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నాడు.







